పుంగనూరులో విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతి

0 9,182

పుంగనూరు ముచ్చట్లు:

 

ఇంటి మరమ్మతులు చేసుకుంటుండగా విద్యుత్‌షాక్‌కు గురై వ్యక్తిమృతి చెందిన సంఘటన మండలంలోని బుర్రావారిపల్లెలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన గంగాధరం(45) ఇంటి మరమ్మతులు చేసుకుంటుండగా ఇంటి పక్కనే ఉన్న బోరు వైర్లు తగిలి షాక్‌కు గురైయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు బాధితున్ని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తుచేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

 

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Man dies of electric shock in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page