రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం నోటీసులు జారీ

0 757,584

తుగ్గలి ముచ్చట్లు:

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొరకు సొమ్మును తీసుకొని గృహాలు నిర్మాణం చేయలేని లబ్ధిదారులకు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు.మంగళవారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల రాంపల్లి,బొందిమడుగుల మరియు లింగనేనిదొడ్డి గ్రామాలలోని లబ్ధిదారులకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు.మూడు గ్రామాల పరిధిలో 724 లబ్ధిదారుల గాను 1,97,70,592 రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని, మొత్తం సొమ్మును రికవరీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంలో తుగ్గలి మండల రెవెన్యూ శాఖ అధికారులు లబ్ధిదారుల వద్దకు వెళ్లి రెవెన్యూ రికవరీ నోటీసులను అందజేస్తున్నారు.అందుబాటులో లేని వారికి మరియు నోటీసులు తిరస్కరించిన వారికి ఇంటి వద్ద ఆర్.ఆర్ నోటీసులను అతికిస్తున్నారు.జిల్లా అధికారులు ఇచ్చిన గడువు లోపల తీసుకున్న సొమ్ము మొత్తం కట్టాలని,లేనిపక్షంలో లబ్ధిదారుల ఆస్తులను జప్తు చేస్తామని అధికారులు లబ్ధిదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, వీఆర్వోలు వెంకట్రాముడు,బాలవర్ధి నాయుడు, రేష్మ,రాజ్ కుమార్ నాయక్,నాగలక్ష్మి తదితర విఆర్వోలు,వీఆర్ఏలు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Notices issued under the Revenue Recovery Act

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page