భార‌త్‌ జ‌లాంతర్గామిని అడ్డుకున్న‌పాక్.

0 4,460

ఇస్లామాబాద్‌ ముచ్చట్లు:

భార‌త్‌కు చెందిన జ‌లాంతర్గామిని అడ్డుకున్న‌ట్లు పాకిస్థాన్ వెల్ల‌డించింది. పాకిస్థాన్ జ‌లాల్లోకి ప్ర‌వేశించ‌కుండా భార‌త స‌బ్‌మెరైన్‌ను నిలువ‌రించిన‌ట్లు ఆ దేశ మిలిట‌రీ పేర్కొన్న‌ది. అక్టోబ‌ర్ 16వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు పాక్ మిలిట‌రీ చెప్పింది. ఇంట‌ర్ స‌ర్వీసెస్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ (ఐఎస్పీఆర్‌) దీనిపై ప్ర‌క‌ట‌న చేసింది. పాకిస్థాన్ నేవి అద్భుత‌మైన రీతిలో నిఘా పెట్టింద‌ని, ప్రొఫెష‌న‌ల్ పోటీత‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించినట్లు ఆ ప్ర‌క‌న‌ట‌లో తెలిపారు. భార‌తీయ జ‌లాంత‌ర్గామి పాక్ జ‌లాల్లోకి ప్ర‌వేశించ‌కుండా అడ్డుకున్న‌ట్లు ఐఎస్పీఆర్ తెలిపింది. భార‌తీయ నేవీకి చెందిన స‌బ్‌మెరైన్‌ను గుర్తించ‌డం ఇది మూడ‌వ సారి అని పాక్ చెప్పింది. నేవీకి చెందిన లాంగ్ రేంజ్ మారిటైమ్ పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా భార‌తీయ స‌బ్‌మెరైన్‌ను గుర్తించిన‌ట్లు ఐఎస్పీఆర్ వెల్ల‌డించింది.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Pak intercepts Indian submarine

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page