పంచాయతీ వార్డు సభ్యులు గ్రామాభివృద్ధికి కృషి చేయాలి..

0 9,687

-ఎమ్మెల్యే ఆర్థర్

 

నందికొట్కూరు ముచ్చట్లు:

 

- Advertisement -

గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు గ్రామాభిృద్ధికి కృషి చేయాలని నందికొట్కూరు శాసనసభ్యులు తోగుర్ ఆర్థర్ అన్నారు. గ్రామపంచాయతీ వార్డు మెంబర్లు మరియు ఉప సర్పంచుల శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొట్కూర్ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ హాజరైయ్యారు. మంగళవారం నందికొట్కూరు ఎంపీడీవో కార్యాలయం నందు నూతనంగా ఎన్నుకోబడిన గ్రామపంచాయతీ  ఉప సర్పంచ్ లకు, వార్డు మెంబర్లకు రెండు రోజుల శిక్షణా తరగతులను  నిర్వహించారు. నూతనంగా ఎన్నుకోబడిన వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచులకు నందికొట్కూరు ఎమ్మెల్యే  తొగురు ఆర్థర్  శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తమ తమ గ్రామ పంచాయతీలను  అభివృద్ధి చేసుకోవాలని తమ వంతు బాధ్యతలను విధులను గుర్తు చేస్తూ ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.  రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గ్రామ పంచాయతీ పరిపాలనను పటిష్టంగా అమలు చేయటానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు నేరుగా సేవలను అందించటానికి సర్పంచులకు అధికారులు ఇవ్వటం జరిగిందన్నారు. గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధిగా గ్రామస్తుల సహకారంతో పారదర్శకంగా పాలన అందించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తే జీవితాంతం  ప్రజా ప్రతినిధిగా అవకాశాలు ఇస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో నందికొట్కూర్ మండల అభివృద్ధి అధికారి సుబ్రమణ్యం శర్మ , మున్సిపల్ కౌన్సిలర్ ధర్మా రెడ్డి, వైసీపీ నాయకులు జగన్ రఫీ, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Panchayat ward members should work for rural development.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page