పెట్రో ధరలు…

0 9,698

-దిద్దుబాటు చర్యల్లో కేంద్రం.

 

న్యూఢిల్లీ ముచ్చట్లు:

 

- Advertisement -

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం చుక్కలనంటుతోన్న పెట్రోల్ ధరలను కంట్రోల్ చేసే పనిలో పడిందా? ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? అంటే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు. అసలు పెట్రోల్ ధరలు తగ్గేనా? అనే ఆలోచనల్లోకి వెళితే, పెరగడమే కాని తగ్గడం లేదు అన్నట్లుగా ఉంది పెట్రోల్, డీజిల్ ధరల రేట్లు చూస్తే. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం చమురు ధరల సవాల్ను ఎదుర్కోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తున్నది.పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు కేంద్రప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. పెట్రోల్ ధరలు తగ్గించడానికి ఆర్థిక శాఖతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చమురు ధరలు తగ్గించాలని భావిస్తున్న పెట్రోలియం శాఖ ఇందుకోసం ఆర్థిక శాఖతో చర్చించినట్లు సమాచారం. చమురు ధరలపై విధిస్తున్న అధిక పన్నులపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేస్త్తోంది. ట్యాక్స్ విషయంలో ప్రజలపై భారం తగ్గించేలా నిర్ణయం ఉండాలని భావిస్తోందట.

 

 

 

ఎల్పీజీ సబ్సిడీనీ కేంద్ర ప్రభుత్వం సమీక్షించాలని యోచిస్తున్నట్టు తెలిస్తోంది. అవసరమైన వారికి మాత్రమే ఎల్పీజీ సబ్సిడీ అందించాలని భావిస్తున్నట్టు సమాచారం.చమురు ధరలు తగ్గించాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వమే నిర్ణయాలు తీసుకుంటే సరిపోదు. ఇందుకోసం కంపెనీలతోనూ చర్చిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. సౌదీ అరేబియా మొదలు రష్యా వరకు కేంద్రం చమురు కంపెనీలతో చర్చించి ధరలు తగ్గించే అవకాశాలను పరిశీలిస్తుందట. వచ్చే మూడు నెలల వరకు బ్యారెల్ చమురు ధర 70 అమెరికన్ డాలర్లు ఉండాలని, అందుకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాలని సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి దేశంలో చమురు ధరలు ఆకాశాన్నంటాయిదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. సామన్యుడికి భారంగా మారిన ఇంధన ధరలను తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.దేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే ప్రతిపాదనపై ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఇతర మార్గాలను అన్వేషిస్తోంది కేంద్రం. ఈ మేరకు ఆర్థిక శాఖతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది.ఇక, సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు చమురు ఉత్పత్తి చేస్తున్న పలు దేశాలతోనూ పెట్రోలియం శాఖ ఈ విషయమై చర్చలు జరుపుతోంది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్లకు మించకుండా రానున్న 3 నెలల పాటు చర్యలు చేపట్టేలా ప్రతిపాదనలు చేసింది.

 

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Petro prices …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page