ప్రజా ఉద్యమాలతో దూసుకెళ్తున్నరేవంత్

0 9,760

హైదరాబాద్ ముచ్చట్లు:

 

వరుసపెట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ…టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూసుకెళుతున్నారు. ఇప్పటికే దళిత-గిరిజన ఆత్మగౌరవ దండయాత్ర పేరిట భారీ సభలు పెట్టి రేవంత్ సక్సెస్ అయ్యారు. ఇక తాజాగా నిరుద్యోగుల కోసం రేవంత్ పోరాటం ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే తన సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో తాజాగా భారీ సభ పెట్టి రేవంత్….కే‌సి‌ఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడిందే….నిధులు..నియమకాలు…నీళ్ళు కోసమని, కానీ కే‌సి‌ఆర్ అన్నీ విషయాల్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.ఇదే సమయంలో మహబూబ్‌నగర్‌లో ఉన్న టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టార్గెట్‌గా విమర్శలు చేశారు. అయితే గువ్వల కూడా వెంటనే కౌంటర్లు ఇచ్చేశారు. రేవంత్ ఇంకా శాశ్వతంగా జైల్లో ఉంటారని మాట్లాడారు. ఇక గువ్వల టార్గెట్‌గా కాంగ్రెస్ శ్రేణులు కూడా ఫైర్ అవుతున్నాయి. అయితే అచ్చంపేటలోనే గువ్వలకు రేవంత్ సరైన సమాధానం ఇస్తారని చెబుతున్నారు.

 

 

 

- Advertisement -

వచ్చే ఎన్నికల్లో గువ్వలకు ఖచ్చితంగా చెక్ పెడతామని మాట్లాడుతున్నారు. అయితే గత రెండు పర్యాయాలుగా అంటే….2014, 2018 ఎన్నికల్లో గువ్వల అచ్చంపేట నుంచి టి‌ఆర్‌ఎస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచేశారు. అయితే రెండుసార్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా అచ్చంపేట నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు పెద్దగా కనిపించడం లేదని కాంగ్రెస్ విమర్శిస్తుంది.వలస బిడ్డని అని చెప్పుకుని కోట్లకు పడగెత్తారని, నల్లమల అటవీ ప్రాంతంలో గువ్వల గుప్తనిధుల కోసం తిరుగుతారని ఆరోపిస్తున్నారు. ఇక పోడు భూములని అధికారుల సాయంతో అమ్ముకునేందుకు చూస్తున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఈ సారి అచ్చంపేటలో మాత్రం టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ వైపు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా గట్టిగానే పనిచేస్తున్నారు. 2004లో గెలిచిన ఈయన, 2009, 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. మూడు సార్లు ఓడిపోయిన సానుభూతి ఉంది. అటు గువ్వలపై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అచ్చంపేటలో గువ్వల మ్యాటర్ సెటిల్ అయ్యేలా ఉంది.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Rewanth is looming with public movements

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page