టార్గెట్ 2023 అంటున్న రేవంత్

0 9,690

హైదరాబాద్ ముచ్చట్లు:

 

అందరి దృష్టి హుజూరాబాద్ ఉపఎన్నికపై ఉంటే..టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టి 2023 ఎన్నికపై ఉన్నాయి…ఆ ఎన్నికలు టార్గెట్‌గానే రేవంత్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారని క్లియర్‌గా అర్ధమవుతుంది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే రేవంత్ లక్ష్యమని తెలుస్తోంది. అలాగే దానితో పాటు తన చిరకాల సీఎం పీఠం దక్కించుకోవడానికి రేవంత్ సైలెంట్‌గా సెట్ చేసుకుంటున్నారు.హుజూరాబాద్ ఉపఎన్నికని రేవంత్ పూర్తిగా లైట్ తీసుకున్నారని చెప్పాల్సిన పని లేదు. ఆయన దృష్టి రాష్ట్ర రాజకీయంపైనే టి‌ఆర్‌ఎస్‌ని ఓడించడం…కే‌సి‌ఆర్‌ని గద్దె దించడం…తాను గద్దెని ఎక్కడమే రేవంత్ టార్గెట్. అందుకు తగ్గట్టుగానే రేవంత్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా కాంగ్రెస్‌ని అధికారంలోకి తీసుకురావడం రేవంత్ టార్గెట్….ఇక సీఎం అనేది పార్టీ నిర్ణయమని, ఎవరూ బయట నినాదాలు చేయొద్దని కూడా వార్నింగ్ ఇచ్చేశారు.కానీ తెరవెనుక మాత్రం తాను సీఎం పీఠంలో కూర్చోవడానికి రేవంత్ పూర్తి స్థాయిలో మద్ధతు కూడబెట్టుకుంటున్నారు. అధిష్టానం రేవంత్‌కు పూర్తిగా పవర్స్ ఇచ్చేసింది..అలాగే అసంతృప్తిగా ఉన్న సీనియర్లని పట్టించుకోవడం లేదు. ఇక వారిని వదిలేసి…రేవంత్ తన టీంని పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకుంటున్నారు. నాయకులంతా తన గ్రిప్‌లోకి వచ్చేలా చూసుకుంటున్నారు. అలాగే తనకు తగ్గట్టుగానే వలసలు ప్రోత్సహిస్తున్నారు.

 

 

 

- Advertisement -

తనకు అనుకూలంగా….కాంగ్రెస్‌కు ఉపయోగపడే నేతలనే రేవంత్ పార్టీలోకి తీసుకొస్తున్నారు.ఇప్పటికే పలువురు నాయకులు రేవంత్‌ని చూస్తే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు నాయకులు కూడా అదే లైన్‌లో ఉన్నారని తెలుస్తోంది. డి.శ్రీనివాస్ లాంటి పెద్దలని కూడా తీసుకొచ్చి, తనకు సపోర్ట్‌గా పెట్టుకోవాలని చేస్తున్నారు. అలాగే టి‌ఆర్‌ఎస్‌లోకి జంప్ కొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కూడా నెక్స్ట్ ఎన్నికల్లోపు మళ్ళీ తనవైపుకు తిప్పుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే కొందరు టి‌ఆర్‌ఎస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారట…వారు టైమ్ చూసుకుని మళ్ళీ కాంగ్రెస్‌లోకి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంటే రేవంత్ సైలెంట్‌గా చాలా కార్యక్రమాలు చక్కబెట్టుకుంటున్నారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Rewanth says Target 2023

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page