గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాలు.

0 7,882

కాకినాడ సిటీ  ముచ్చట్లు:

మురుగప్ప గ్రూప్  వారి కోరమాండల్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కార కార్యక్రమం మంగళవారం ఉదయం స్ధానిక సూర్యకళామందిరంలో ఆంధ్ర రిజనల్ బిజినెస్ హెడ్ కే యస్ ఆర్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన కాకినాడ నగర శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ బాలికల ప్రతిభ గుర్తించి, ఇటువంటి పురస్కారాలు అందించడం ఆనంద దాయకమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడ స్త్రీ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇటువంటి కార్యక్రమాలు వల్ల పిల్లలు మరింత విద్యకు ఆకర్షితులు అవుతారని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మరోక అతిధి కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ, ఎక్కడ విద్య అభివృద్ధి చెందుతుందో, అక్కడ మెరుగైన సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీ తన కాళ్ళపై తాను నిలబడాలి అంటే విద్య చాలా అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న అనేక పొత్సాహకాలు విద్యార్థులు ఉపయోగించుకోవాలని పిలుపు నిచ్చారు .కోరమాండల్ వంటి సంస్థలు నిర్వహిస్తున్న ఇటువంటి కార్యక్రమాలు ద్వారా విద్యార్థులలో పోటీ తత్వం పెరిగి, విద్యలో మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని గీత అన్నారు. ఈ సంధర్భంగా రీజియన్ బిజినెస్ హెడ్ చక్రవర్తి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో ఆరు జిల్లాల ప్రభుత్వ పాఠశాలల్లో ఆరు వందల మంది బాలికలను ప్రతిభ ద్వారా గుర్తించి, వారికి రూ3500,రూ5000 చొప్పున ప్రతిభా పురస్కారాలు కోరమాండల్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. 2016-17 నుండి ఊ ప్రతిభ పురస్కారాలు అందిస్తున్నామని, గత ఏడాది కరోనా కారణంగా నిలిచిపోయిన ఈ పురస్కారాలు, ఈ సంవత్సరం పురస్కారాలతో కలిపి  జిల్లా వ్యాప్తంగా 200 మంది బాలికలకు ప్రతిభ పురస్కారాలు అందించినట్లు చక్రవర్తి తెలిపారు. తొమ్మిదో తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగా ఈ ప్రతిభ పురస్కారాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ యస్. విజయకుమార్, కోరమాండల్ మేనేజర్లు  కే.సుధాకర్, కీర్తి కృష్ణ,జి.రామోజీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Rural Girls Talent Awards

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page