బాణాసంచా స్వాధీనం

0 75,762

పిఠాపురం ముచ్చట్లు:

ఎటువంటి అనుమతులులేకుండా జనావాసాలమధ్య బాణాసంచాను నిల్వ ఉంచిన గొదాములపై పిఠాపురం పోలీసులు దాడులు నిర్వహించి,సుమారు రెండున్నర లక్షలరూపాయల విలువైన బాణాసంచాను స్వాధీనం చేసుకుని,ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.పిఠాపురం మండలం చిత్రాడలోని దుర్గమ్మ వీధిలో జనావాసాలమధ్య రెండు గొదాముల్లో బాణాసంచాను నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారంతో పిఠాపురం సీఐ వైఆర్కే.శ్రీనివాస్ ఆధ్వర్యంలో టౌన్ ఎస్సై శంకర్రావు తన సిబ్బందితో కలిసి దాడులు చేపట్టారు.ఎటువంటి అనుమతులులేని ఆ రెండు గొదాముల్లో పెద్దయెత్తున  గంధకం,సూరేకారం,బీడు తదితర పేలుడు పదార్థాలను,శివకాశీ దీపావళి సామగ్రిని గుర్తించి,సీజ్ చేశారు.గొదాముల యజమానులైన కేదారశెట్టి వేంకటేశ్వర్లు,కేదారశెట్టి సత్యనారాయణను అదుపులోకి తీసుకుని,కేసులు నమోదు చేశారు..కాగా.,కాకినాడ ఇన్ఛార్జ్ డీఎస్పీ బోను అప్పారావు ఘటనాస్థలాన్ని పరిశీలించి,అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Seizure of fireworks

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page