వాల్మీకి జయంతి సంధర్బంగా నేడు రాష్ట్ర స్థాయి దేశపు ఎద్దుల బండ లాగుడు పోటీలు

0 9,664

తుగ్గలి ముచ్చట్లు:

 

తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి గ్రామం నందు శ్రీ వాల్మీకి మహర్షి జయంతి మరియు మందిర నిర్మాణ
పంచమ వార్షికోత్సవ సందర్భముగా నేడు జోన్నగిరి గ్రామము నందు రాష్ట్ర స్థాయి దేశపు ఎద్దుల బండ లాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు జొన్నగిరి వాల్మీకి సేవ సమితి సభ్యులు తెలియజేసారు.బుధవారం రోజున ఉదయం 8.00 గం.లకు శ్రీ వాల్మీకి మహర్షి అభిషేకములు,మధ్యాహ్నం 1.00 గంటలకు అన్నప్రసాద సమర్పణ,అనంతరం 4.00 గం. లకు శ్రీవాల్మీకి మహర్షి విగ్రహము ఊరేగింపు కార్యక్రమము నిర్వహిస్తునట్లు వారు తెలియజేసారు.రాష్ట్ర స్థాయి దేశపు ఎద్దుల బండ లాగుడు పోటీలు ఉదయం 8.30ని.లకు బండలాగు పోటీలు ప్రారంభమవుతుందనిమొదటి బహుమతి 20,000 రూ,రెండవ బహుమతి 15,000,మూడవ బహుమతి 10,000,నాల్గవ బహుమతి దాత 8,000,ఐదవ బహుమతి దాత 5.000,ఆరవ బహుమతి దాత 3,000,ఏడవ బహుమతి దాత 2,000 రు అందజేయునట్లు వారు తెలియజేసారు.ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వాల్మీకి జయంతిని విజయవంతం చేయాలని జొన్నగిరి వాల్మీకి సేవా సమితి సభ్యులు తెలియజేశారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: State level country bullock cart competitions today on the occasion of Valmiki’s jubilee

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page