తెరాసఎమ్మెల్యే అందోళన

0 7,599

అందోల్ ముచ్చట్లు:

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట పట్టణంలోని నాందేడ్ – అఖోల ప్రధాన రహదారి పై  ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో  తెరాస నాయకుల ధర్నా నిర్వహించారు.  ఈటెల రాజేందర్ దళిత బంధు ను అడ్డుకుంటున్న దళిత ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మనె  దహనం చేసారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలోని దళితుల పై  ప్రేమ ఉంటే ప్రతి దళిత కుటుంబానికి బీజేపీ కేంద్రప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలి. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే దళిత బందును రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఆములుచేశారు.  ఇప్పుడు ఎన్నికల నెపంతో దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని ఈటెల రాజేందర్ కుట్రలు పన్నుతున్నాడు.  ఈటల రాజేందర్ తెరాస పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడే  దళిత బంధు పథకానికి అసెంబ్లీలో ఆమోదం తెలిపారని అన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:TeresaMmley Anxiety

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page