మహిళల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే వైసిపి లక్ష్యం

0 9,866

– మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ఎప్పటికి రుణపడి ఉంటా
– ఎంపీ మిథున్ రెడ్డి
– మండలంలో రూ 6,60 కోట్లు ఆసరా పంపిణి

రామసముద్రం ముచ్చట్లు :

 

 

- Advertisement -

మహిళల జీవితాలలో వెలుగులు నింపాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశ్యమని రాజంపేట పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం మదనపల్లె ఎమ్మెల్యే యం.నవాజ్ బాషాతో కలసి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో రెండో విడత వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ మహిళల జీవితాలలో మార్పులు తీసుకురావలన్నదే ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశమన్నారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రతిపక్ష పార్టీ గుర్తించలేక పోతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తేదీలవారిగా ఆములు చేస్తున్నారని తెలిపారు. పిల్లల నాణ్యమైన చదువుకోసం అమ్మ ఒడి పథకంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేయడం జరుగుతున్నదని, నాడు – నేడు ద్వారా అన్ని ప్రభుత్వ స్కూల్ లల్లోను ప్రవేటు స్కూల్ కు దీటుగా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. మండల పరిధిలో అన్ని గ్రామాలకు 90 శాతం రోడ్లు వేయడం జరిగిందని, ఇంకా మిగిలిపోయిన గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో హంద్రీనీవా నీళ్లు రామసముద్రం మండలానికి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

 

 

 

దీంతో గ్రామాలకు త్రాగునీరు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. మండలంలో 2489 మందికి ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, ఇంకా ఇండ్లుకు అర్హులైన లబ్ధిదారులు ఉంటే వారికి ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. జడ్పీటిసి, యంపిపి, ఎంపీటీసీ, సర్పంచుల రాష్ట్ర స్టయి పదవులలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగనన్నను దక్కుతుందని తెలిపారు. గ్రామ స్థాయి లో సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ ఇంటి వద్దకు తీసుకెళ్లి అందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే యం.నవాజ్ బాషా మాట్లాడుతూ మహిళలను అన్ని రకాలుగా ముందుకు తీసుకెళుతున్న ముఖ్యమంత్రి కి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. రామసముద్రం మండల పరిధిలో 886 మహిళ సంఘాలలోని 8926 మంది సభ్యులకు రూ.6 కోట్ల 60 లక్షల 6 వేల 55 అందజేయడం జరిగింది. రూ 6.60 కోట్ల మెగా చెక్కును మహిళ సంఘ సభ్యులకు అందజేశారు. సిఐ మధుసూదన్ రెడ్డి,

 

 

స్థానిక ఎస్ఐ రవీంద్ర బాబు, బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాసులు, వెలుగు ఏపీఎం రాజేశ్వరి, ఏపీఎండీసీ చెర్మన్ సమీమ్ ఆస్లామ్, ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, జడ్పిటిసి సిహెచ్ రామచంద్రారెడ్డి, ఎంపీపీ కుసుమ కుమారి, వైసీపీ మండల ఇంచార్జ్ భాస్కర్ గౌడు సింగిల్విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు శంషీర్, ఎంపీటీసీలు, సర్పంచులు, వైసిపి నాయకులు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: The goal of the YCP is to brighten the lives of women

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page