8 నెలల కనిష్ఠానికి వైరస్ వ్యాప్తి

0 9,763

దిల్లీ ముచ్చట్లు:

 

కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. గత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కొత్త కేసులు.. తాజాగా 13 వేలకు పడిపోయాయి. కొత్త కేసులు 231 రోజులు, క్రియాశీల కేసులు 227 రోజుల కనిష్ఠానికి క్షీణించాయి. మరణాల సంఖ్య 200 దిగువనే నమోదైంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది.సోమవారం 11,81,314 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 13,058 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. అంతక్రితం రోజుకంటే కొత్త కేసులు 500 మేర తగ్గాయి. నిన్న 19,470 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3,40,94,373 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అందులో 3,34,58,801 మంది వైరస్‌ను జయించారు. ఇటీవల కాలం వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,83,118గా ఉంది. క్రియాశీల రేటు 0.54 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు  98.14 శాతానికి పెరిగింది. నిన్న 164 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా 4,52,454 మంది మృత్యుఒడికి చేరుకున్నారు.మరోపక్క కరోనా టీకా కార్యక్రమ వేగం పుంజుకుంది. నిన్న 87,41,160 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 98 కోట్ల మార్కును దాటేసి.. 100 కోట్లకు చేరువవుతోంది.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: The virus spreads for a minimum of 8 months

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page