కరోనా వారియ ర్స్ కి సన్మానం

0 7,620

హైదరాబాద్   ముచ్చట్లు:

100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి కావస్తున్న సందర్బంగా బీజేపీ ఆధ్వర్యంలో కరోనా వారియర్స్ ను సన్మానించనున్నట్లు బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు తెలిపారు. హైదరాబాద్ భర్కత్ పురా లోని సిటీ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశం లో గౌతమ్ రావు మాట్లాడుతూ కోవిడ్19 మహమ్మారి నుండి బయటపడటానికి కారణం వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ ను ఉత్పత్తికి మోడీ ఎంతో కృషి చేశారు. అమెరికా, చైనా లాంటి దేశాలకు ఆదర్శంగా ఉన్నాం. 100 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న దేశం ఒక భారతదేశం మాత్రమే. ఈ ఘనత నరేంద్రమోడీ ప్రభుత్వానికే చెందుతుంది. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు వారికి వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లు చేసి ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాం. నరేంద్రమోదీ ప్రపంచ మానవాళిని కాపాడే నాయకుడిగా  ఎదిగారు. ఆక్సిజన్ ప్లాంట్లు,శానిటైజర్లు,మాస్కులు, మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కరోనా వారియర్స్ ను వ్యాక్సినేషన్ సెంటర్లలో రేపు సన్మానించనున్నాం. 130 దేశాలు వ్యాక్సిన్ భారత్ నుండి ఎగుమతిని కోరుకుంటున్నాయని అన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Tribute to Corona Warriors

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page