4 బల్లలు పగలు కొడితే రాష్ట్రపతి పాలనా

0 7,591

విజయవాడ ముచ్చట్లు:

ఏపీ రాజకీయాలు భగ్గుమంటున్నాయి. అటు వైసీపీ నేతలు, ఇటు టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారయ్యాయి రాష్ట్ర రాజకీయాలు. ప్రతి రోజు ఒకరిపై ఒకరు దుమ్మత్తిపోసుకోవడంతోనే సరిపోతుంది. ఇక నిన్న తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు కోపాన్ని కట్టలు తెంచుకున్నారు. పట్టాభి ఇంటిపై టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగారు. ఫర్నిచర్లు ధ్వంసం చేశారు. దీంతో దాడులకు నిరసనగా టీడీపీ నేడు బంద్‌కు పిలుపుచ్చింది.టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ఆఫీస్‌లో కూర్చుని జగన్‌ను తిట్టారు. అందుకే పార్టీ ఆఫీస్‌ను పగలగొట్టారని అన్నారు.చంద్రబాబు 420.. నాలుగు బల్లలు, కుర్చీలు పగలగొడితే ప్రజాస్వామ్యం ఖూనీ అయినట్టా అని నాని ప్రశ్నించారు. నీ ఆఫీస్‌లో బల్లలు పగిలితే రాష్ట్రపతి పాలన పెట్టాలా..? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు బంద్‌కు పిలుపునిస్తే రాష్ట్రంలో బడ్డీకొట్టు కూడా మూయించలేడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.నిన్న మొదలైన ఈ ఘర్షణ వ్యవహరంలో తారా స్థాయికి చేరిపోయింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధమే కాకుండా ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నారు. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీసు బలగాలు ఆందోళనకు దిగుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలిస్తున్నారు. బంద్‌లో భాగంగా అటు టీడీపీ నేతలు, ఇటు పోలీసుల మధ్య తోపులాట జరుగుతోంది. బస్సులను తిరగనీయకుండా అడ్డుకుంటున్నారు. రోడ్లపై బైఠాయించి నిరసనకు దిగుతుండటంతో అరెస్టు పర్వం కొనసాగిస్తున్నారు పోలీసులు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:4 Tables Daytime Presidential Administration

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page