ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేసిన బిజిపి నాయకులు

0 8,558

బెల్లంపల్లి  ముచ్చట్లు:

భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య   దిష్టిబొమ్మ దహనం చేసారు.అనంతరం పట్టణ అధ్యక్షులు కోడి. రమేష్  మాట్లాడుతు మంగళవారం దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో   దేశ ప్రధాని  నరేంద్ర మోడీ  దళిత ద్రోహి అంటూ దిష్టిబొమ్మ దహనం చేయడం అన్యాయం,   అధికార పార్టీ ఎమ్మెల్యే దేశ ప్రధాని దిష్టిబొమ్మ ఎలా తగలబెడతారుఅని అన్నారు. దళిత ద్రోహులు  తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని సిఎం చేస్తానని దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని ఇంటికో ఉద్యోగం ఇస్తానని నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిన కేసీఆర్ దళిత ద్రోహి,  హుజరాబాద్ లో నాలుగు నెలల కిందట దళిత బంద్ ప్రకటించి ఏ ఒక్కరికి అందచేయలేదు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి హుజరాబాద్ లో దళిత బందులు నిలిపివేస్తే దానికి కారణం బీజేపీ అనడం సిగ్గుమాలిన చర్య నోటిఫికేషన్ రాకముందు ఎంత మంది దళితులకు కెసిఆర్  10 లక్షల రూపాయలు ఇచ్చారు. దళిత ఎమ్మెల్యే  బెల్లంపల్లి  నియోజకవర్గంలో దళిత బంధు అమలుపరచాలని సీఎం గారిని అడిగే దమ్ము ఉందా అని అన్నారు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు 2023 లో ప్రజలు నీకు ఓటుతో సమాధానం చెప్పి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెడతారు భారతీయ జనతా పార్టీ ప్రజలతో మమేకమై ప్రజల హక్కుల కొరకు కొట్లాడుతూ అధికారంలోకి రావడం తథ్యమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు  రాచర్ల సంతోష్. మడుగుల శ్రీనివాస్. జిమ్మిడి వెంకటేష్. నవీన్. ఎరుకల నర్సింగ్. కునిరాజుల అరవింద్. జూపాక సాయి. యుగంధర్. జీదుల రాములు, పీక లక్ష్మన్. అనిల్, ధార కళ్యాణి, గోలి శ్రీనివాస్, రజిని కాంత్. రాజ్ కుమార్. రామ్ చందర్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:BJP leaders who burnt the MLA effigy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page