కాలిన మృతదేహం లభ్యం.

0 7,784

హైదరాబాద్ ముచ్చట్లు:

పహాడీషరీఫ్  పోలీస్ స్టేషన్ పరిధిలో   లో కాలిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. ఎక్కడో హత్య చేసి…ఇక్కడ తగులబెట్టి ఉండవచ్చని పోలీసుల అనుమానం.  వివరాల్లోకి వెళితే సుమారు ముప్పయి సంవత్సరాల యువకుడిని హత్య చేసి పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ టెక్ పరిసర ప్రాంతంలో లోని పొదల మధ్య పడవేసారు. ఆనవాళ్లు తెలియకూడదని దుండగులు  మృతదేహాన్ని పొదల మధ్య పడవేసి కాల్చి వేశారు. హిందూ టెక్ లో పని చేసే వ్యక్తి చూసి 100 డయల్ కు చేయగా పహాడి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు వనష్టలి పురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి , పహడీశరీఫ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు , అర్జునయ్య తదితరులు చేరుకొని క్లూస్ టీమ్ ను రప్పించారు. ఏసీపీ మాట్లాడుతూ అయిదు టీంలు ఏర్పాటుచేసాం.  అన్ని సీసీ టీవీ లను పరిశీలిస్తున్నాం.  తొందరగా కేసును చేధిస్తామని  అన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Burned body available

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page