విశాఖ-చెన్నై కారిడార్ పై తీవ్ర అసంతృప్తి

0 9,858

విజయవాడ ముచ్చట్లు:

 

విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ పై రుణ సంస్థ ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టు రేటింగ్‌ ప్రమాదంలో (ఎట్‌ రిస్క్‌) ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఘాటు లేఖ రాసినట్టు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొంటున్న కాంట్రాక్టు సంస్థల నుంచి తమకు నేరుగా ఫిర్యాదులు వస్తున్నట్లు వివరించింది. ప్రధానంగా రాచగన్నేరి, నాయుడుపేట, ఏర్పేడు ప్రాంతాల్లో పనులు నిర్వహిస్తున్న కల్పతరు పవర్‌ ట్రాన్సిమిషన్‌ లిమిటెడ్‌ సంస్థ బకాయిలపై తమకు ఫిర్యాదు చేసిందని వివరించింది. త్వరలో ఈ సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేసింది.సుమారు 280 కోట్ల డాలర్లు (రూ.21 వేల కోట్లు) అంచనాతో నిర్మితమయ్యే విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నిర్మాణానికి ఎడిబి 62.5 కోట్ల డాలర్లు (రూ.4,700 కోట్లు) పరిశ్రమల శాఖ ద్వారా రుణం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులో పనిచేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన నిధులను సకాలంలో చెల్లించడం లేదనీ, ఎపి సర్కారు బకాయిలు పెడుతునుదని ఎడిబి గుర్తించింది. ఈ మేరకు గత జూలై, ఆగస్టు నెలల్లో రాష్ట్రానికి లేఖలు రాసినప్పటికీ ఫలితం కనిపించలేదని తాజా లేఖలో పేర్కొంది. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లకు17 మిలియన్‌ డాలర్ల (రూ.127 కోట్లు) బకాయిలు ఉన్నాయని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను జత చేయకపోవడం వల్లనే నిధుల పంపిణీలో జాప్యం జరుగుతోందని గుర్తించినట్లు పేర్కొంది. త్రైపాక్షిక ఒప్పంద సమావేశంలో కూడా ఇదే అంశంపై చర్చించామని, నిధుల విడుదలపై పూర్తి నివేదిక ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీనిచ్చినప్పటికీ, ఇప్పటి వరకు తమకు అది చేరలేదని ఎడిబి పేర్కొంది.ఈ పరిస్థితుల్లో కొనసాగుతున్న విసిఐసి తొలి దశపై ప్రభావం పడుతోందని, దీనికి తోడు రెండో దశపైనా ప్రభావం ఉంటుందని ఆరదోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే తొలిదశ ప్రాజెక్టుకు’ఎట్‌ రిస్క్‌’ రేటింగ్‌ ఇవ్వడం జరిగిందని వివరించింది. ఆర్ధిక నిర్వహణ సమస్యలు, నిధుల పంపిణీ తక్కువగా ఉండడం వల్లనే ఈ రేటింగ్‌ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొంది. ఇప్పటికైనా ఈ అంశాలను పరిష్కరించి ప్రాజెక్టు సజావుగా సాగేలా చూడాలని సూచించింది. విసిఐసి నిర్మాణానికి రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూర్చవలసివుంది. ఈ బకాయిల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఎంతో రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడించాలి.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Extreme dissatisfaction on the Visakhapatnam-Chennai corridor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page