అనంతపురం జిల్లా హిందూపురం లో తీవ్ర ఉద్రిక్తత

0 9,692

-టిడిపి నాయకుల పై వైసిపి నేతల దాడి

 

హిందూపురం ముచ్చట్లు:

 

- Advertisement -

తెలుగుదేశం పార్టీ చేపట్టిన రాష్ట్ర బంద్ అనంతపురం జిల్లా హిందూపురంలో  ఉద్రిక్తతకు తెరలేపింది. పోలీసుల వలయాన్ని ఛేదించడానికి టూ టీడీపీ శ్రేణులు పట్టణంలోని ప్రధాన వీధులలో షాపులను మూయిస్తూ అంబేద్కర్ కూడలి వద్దకు చేరుకోగానే వైసీపీ కార్యకర్తలు వారిని అడ్డుకుని వారిపై దాడి చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైకాపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పినా పరిస్థితి చక్కపడలేదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజి నమ్మ తెలుగు యువత పట్టణ కార్యదర్శి సునీల్ మీదకు వైకాపా కార్యకర్తలు చొచ్చుకొని వచ్చి వారి కండువాలు లాగేశారు.  పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Extreme tension in Hindupuram, Anantapur district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page