రైతులకు ఉపయోగపడే పనులను గుర్తించండి

0 9,696

చౌడేపల్లె ముచ్చట్లు:

 

రైతులకు అవసరమైన, ఉపయోగపడే పనులను గుర్తించాలని జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు సూచించారు. బుధవారం స్థానిక ఉపాధిహామీ కార్యాలయంలో లేబర్‌ బడ్జెట్‌2022-23 ఆర్థిక సంవత్సరానికి నూతన పనుల ఎంపికపై సర్పంచులు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి సిబ్బందితో అవగాహన సదస్సు జరిగింది. ఈసంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో 21 ప్రాజెక్టుల ద్వారా అనేక రకాల పనులు చేపట్టుకోవచ్చునని సూచించారు. రైతుల పొలాలతోపాటు, కమ్యూనిటీ పనులు గుర్తించి వాటికి అంచనాలు సిద్దం చేసి కలెక్టర్‌ అనుమతికోసం త్వరగా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.ప్రధానంగా భూగర్భ జలాలు పెంచడంతోపాటు, పండ్లతోటలు, భూ అభివృద్దిపనులపై దృష్టిసారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీపీ రామమూర్తి, సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌, ఏపిఓ శ్రీనివాసుల యాదవ్‌ తదితరులున్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Identify tasks that are useful to farmers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page