ఆర్జి 1 ఏరియాలో కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేత

0 7,579

పెద్దపల్లి ముచ్చట్లు:

ఆర్జి 1 జీఎం కార్యలయంలో మెడికల్ ఇన్ వాలిడేషన్, చనిపోయిన ఎన్సీడబ్ల్యూఏ  ఉద్యోగుల డిపెండెంట్స్ 56 మందికి కారుణ్య నియామక ఉద్యోగ  ఉత్తర్వులు ఆర్జి 1 జనరల్ మేనేజర్ కె.నారాయణ చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్జీ-1 జనరల్ మేనేజర్ కె.నారాయణ మాట్లాడుతూ సింగరేణి సి అండ్ ఏం.డి ఎన్.శ్రీధర్ చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించటం జరిగిందని  అన్నారు. మెడికల్ బోర్డ్ కు దరఖాస్తు చేసున్న వారు వెంటనే ఆన్ ఫిట్ అవటం ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో డిపెండెంట్ కింద  పోస్టింగ్ అందించటం త్వరితగతిన అవుతుందని అన్నారు. బుధవారం ఆర్జీ-1 ఏరియాలో 56 మంది  డిపెండెంట్లకు ఒకే దఫా  కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని, అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వటం జరిగిందని అన్నారు. వీరికి ఆర్జి 1 ఏరియా లో పోస్టింగ్ ఇవ్వటం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు ఆర్జి 1 ఏరియాలో 916 మందికి కారుణ్య నియామక ఉధ్యోగాలను అందించటం జరిగిందని, ఇందులో 25 మంది మహిళలకు కూడా అవకాశం ఇవ్వటం జరిగిందని అన్నారు. అతి తక్కువ సమయంలో కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేయటం జరిగిందని అన్నారు. జాయిస్ కాబోవు ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ప్రస్తుతం బయట ప్రవైట్ ఉద్యోగాలకు కూడా బారి కాంపిటేషన్ ఉందని ఇలాంటి పరిస్థితులలో సింగరేణి ఉధ్యోగం రావటం ఒక వరం లాంటిది అని అన్నారు. రోజు రోజుకి సింగరేణి సంస్థ లో యువ ఉద్యోగుల స్థాయి పెరుతుందని అన్నారు. సింగరేణి భవిష్యత్ యువ కార్మికుల చేతులలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఏంఓఏఐ అధ్యక్షులు పోనోగోటి శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ లక్ష్మీ నారాయణ, జీఎం ఆఫీస్ ఇంచార్జ్ ప్రవీణ్, సీనియర్ పి ఓ  బంగారు సారంగ పాణి, సీనియర్ పిఓ (శావణ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Issuance of compassionate employment orders in RG1 area

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page