అధికారులను కోర్టుకు పిలిపించడం సరికాదు-సుప్రీంకోర్టు 

0 7,869

జగిత్యాల ముచ్చట్లు:

ప్రజలకు సేవలు అందించే అధికారులను కోర్టులకు పిలిపించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సెర్వీసెస్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు హరి అశోక్ కుమార్,జిల్లా అధ్యక్షుడు ఎండీ.వకీల్ ఉద్యోగుల, అధికారుల సమాచారం కోసం తెలిపారు.ఉద్యోగి తొలగింపుకు సంబంధించిన కేసులో యూ.పి.గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ,రీజనల్  మేనేజర్ లు  తమ ఎదుట హాజరు కావాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది.అధికారులను పిలిపించుకునే పద్ధతి సరి కాదని హితవు పలికింది.అసలు ఉద్యోగిని ఎలా తొలగిస్తారు ? బ్యాంకులో రోజువారీ వేతనంతో ఎంత మంది పని చేస్తున్నారు ? అన్న వివరాలు చెప్పేందుకు తమ ఎదుట హాజరుకావాలని బ్యాంకు ఉన్నతాధికారులను అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది .దీన్ని సవాల్ చేస్తూ ఆ బ్యాంకు సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది.ఈ అంశంపై జస్టీస్ హేమంత్ గుప్త,జస్టిస్ వి.సుబ్రమణియన్ ల  ధర్మాసనం విచారణ చేపట్టింది.ఈ కేసులో బ్యాంకు చైర్మన్, రీజనల్ మేనేజర్ లను స్వయంగా విచారణకు హాజరు కావాలని హైకోర్టు అదేశించాల్సిన పని లేదు.ఉద్యోగి తొలగింపు చట్టవిరుద్దమని భావిస్తే అందుకు తగిన ఉత్తర్వులు జారీ చేసే అధికారం హైకోర్టు కు ఉంది.అధికారులను కోర్టుకు పిలిపించే పద్ధతిని మార్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే పేర్కొందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ తీర్పు చెప్పిందని ఉద్యోగుల, అధికారుల సమాచారం కోసం ఆ తీర్పు వివరాలను వారు తెలిపారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:It is not right to summon officers to court-Supreme Court

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page