బీజేపీకి జనసేన మద్దతు.

0 77,883

బద్వేలు ముచ్చట్లు:

కడప జిల్లా బద్వేలు లో బీజేపీ, జనసేన నేతలు మీడియాతో మాట్లాడారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుమాట్లాడుతూ మిత్ర పక్షమైన బీజేపీ అభ్యర్థి గెలుపునకు జనసేన కృషి చేస్తుంది. వైసీపీ నేతల్లో ఓటమి భయం వెంటాడుతోంది.  వైసీపీ మంత్రి వర్గం అంతా బద్వేలు లోనే తిష్ట వేసింది. ఎమ్మెల్యే రాచమల్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు పై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసామని అన్నారు.  మంత్రి పెద్దిరెడ్డి ఉప ఎన్నికలో బీజేపీ కి ఏజెంట్ లు లేకుండా చేస్తామన్నారు. ఉప ఎన్నికలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నిన్న కొంత మంది వైసీపీ మంత్రులు దళితులకు బీజేపీ ఏమి చేసిందని మాట్లాడారు. బద్వేలు లోని 7 గ్రామాల్లో 7 కోట్ల పై చిలుకు నిధులు కేంద్రం ఇచ్చింది. వైసీపీ మాత్రం 3 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. గోపవరం పంచాయతీ కి కేవలం 500 రూపాయలు నిధులు ఇచ్చింది. కేంద్ర నిధులను వైకాపా దుర్వినియోగం చేస్తుంది. కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు వుంటున్నాయి. అభివృద్ది అంతా కేంద్ర నిధులతోనే. సంక్షేమం పేరుతో సంక్షోభం చేస్తున్న వైసీపీ. కేంద్రం సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద పీట వేస్తుంది. వైసీపీ కేవలం నవరత్నాలే చెప్తారు. ప్రజలకు ఓటేసుకునే హక్కు కల్పించాలి. లిక్కర్ మాఫియా ను వైకాపా నడిపిస్తుందని ఆరోపించారు.
బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ బద్వేలు ఉప ఎన్నికలో జనసేన మద్దతు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. రాష్ట్రంలో దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. వైసిపి నేతల్లో భయం పట్టుకుంది. బద్వేలు లో ఓటర్లను భయ బ్రాంతులకు గురిచేయలని వైసీపీ నేతలు చూస్తున్నారు. టీడీపి కార్యాలయం పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
జనసేన కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ బద్వేలు ఉప ఎన్నికకు త్రిసభ్య కమిటీని నియమించారు. మాట తప్పను అన్న జగన్ యూ టర్న్ తీసుకున్నారు. ఏపీ ని అప్పుల ఆంద్రప్రదేశ్ గా మార్చిన వైసీపని అన్నారు. వైసీపీ ని గద్దె దించడమే బిజెపి, జనసేన లక్ష్యం. వైసిపి దాడులకు, దౌర్జన్యాలకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.
బద్వేలు బిజెపి అభ్యర్థి పనతల సురేష్ మాట్లాడుతూ జనసేన కలిసి రావడాన్ని స్వాగతిస్తున్నాం. జనసేన, బీజేపీ కలిసి సైనికుల్లా పని చేస్తామని అన్నారు. ఉప ఎన్నికలో గెలుస్తాం. బద్వేలు ఉప ఎన్నిక తర్వాత రాష్ట్రం లో దశ దిశ మారబోతున్నాయి. బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ గెలుస్తుందని ధీమా వుంది. వైసీపీ పతనం బద్వేలు ఉప ఎన్నిక తోనే మొదలు అవుతుందని అన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Janasena supports BJP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page