బీజేపీ పార్టీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు.

0 5,666

వేములవాడ  ముచ్చట్లు:

బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు  కొప్పు భాషా  పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా  వేములవాడ పట్టణ బిజెపి  భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్  ఆధ్వర్యంలో  వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం బిజెపి జిల్లా మోర్చా అధ్యక్షులు సం టి  మహేష్ మాట్లాడుతూ మానవతా విలువలు ఉన్నతమైన అటువంటి ఆదర్శాలు కలిగిన రామాయణ మహా కావ్యాన్ని వాల్మీకి లిఖించి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రామాయణాన్ని రాచించిన వాల్మీకి దేశంలోనే కాకుండా ప్రంపంచ స్థాయిలోనే ప్రతి ఒక్కరికి అదర్శంగా నిలిచిన మహవ్యక్తి మహర్షి అయ్యాడన్నారు. గొప్పవారి జయంతి వేడుకలను నిర్వహించడామే కాదని, ఆయా వ్యక్తులు జీవితాంతం ఏ విలువలకైతే పాటుపడ్డారో వాటిని గుర్తుంచుకుని ఆచరించడం ఉత్సవాల ముఖ్య ఉద్ధేశ్యమన్నారు. కృషి, పట్టుదల ఉంటే ఎదైనా సాధించవచ్చనడానికి వాల్మీకి జీవితమే ఒక సందేశమని వారు పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ కూడా రాజుగా దేశ ప్రజలను ఎలా పరిపాలించాలో పూర్తిగా తెలియజేయడమైనదన్నారు. రామాయణ కావ్యాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రపంచ దేశాలలో కూడా చాలామంది రాముడిని ఆదర్శంగా తీసుకుని పాలనను, కుటుంబ వ్యవస్థను సన్మార్గంలో ఉండేలా ఆదర్శ జీవితం కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్ కౌన్సిలర్ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు అన్నారం శ్రీనివాస్ పిన్నింటి హనుమాన్లు బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి వివేక్ రెడ్డి ఇ బిజెపి నాయకులు పిట్టల అనిల్  మహేష్ తిరుమల్  సాయి కార్తీక్  గుడిసె మనోజ్ పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Jayanti celebrations for Valmiki at the BJP party office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page