మానవాళికి మహర్షి వాల్మీకి జీవితం ఆదర్శనీయం-తాహసిల్దార్ రాయలింగు

0 757,578

మందమర్రి. ముచ్చట్లు:

రామాయణ మహాకావ్యాన్ని ప్రపంచ మానవాళికి అందించిన మహర్షి వాల్మీకి జీవితం అందరికి ఆదర్శనీయం అని మందమర్రి మండల తహశీల్దార్ జాడి రాయలింగం పేర్కొన్నారు. బుధవారం మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని మందమర్రి మండల తహశీల్దార్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.ముందుగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వాల్మీకి మహర్షి జయంతిని అధికారికంగా నిర్వహించడం జరిగిందన్నారు. వాల్మీకి జీవితం మానవాళికి ఆదర్శం, ఆయన జీవితాన్ని అందరుఆదర్శంగా తీసుకొని మానవ సంబంధాలకు విలువలు ఇస్తూ జీవించాలని, ఆయన రచించిన రామాయణ మహాకావ్యంలో మానవ సంబంధాల విలువలను చక్కగా పొందుపర్చారని పేర్కొన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అనడానికి బందిపోటుగా ఉన్న వాల్మీకి రామయణం రచించడమే నిదర్శనమని అన్నారు. అనంతరం వాల్మీకి బోయ సంఘం కన్వీనర్ రవి వాల్మీకి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించడం సంతోషకరమైన విషయమని తెలిపారు. అలాగే వాల్మీకి బోయలను ఎస్టి జాబితాలో చేర్చడానికి వేసిన చెల్లప్ప కమీషన్ బోయల స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి అందించి సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటి వరకు బోయల ఎస్టీ కళా కలగానే మిగిలిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి త్వరగా ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో  గీర్దావర్లు. రవికిశోర్, నవీత్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ తిరుపతి, టైపిస్టు కిరణ్మయి,
వాల్మీకి బోయ సంఘం జిల్లా నాయకులు కుర్రె శ్రీనివాస్,పట్టణ అధ్యక్షులు బోగి వెంకటేశ్వర్లు,మండల శంకర్,బుకాల సంతోష్ కుమార్,ఈశ్వర్ వాల్మీకి,సింహా వాల్మీకి, తహశిల్దార్ కార్యాలయ సిబ్బంది, బోయ సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Life is ideal for Maharshi Valmiki for humanity-Tahasildar Rayalingu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page