ఎరువు  కరువు

0 9,687

ఏలూరు ముచ్చట్లు:

 

దేశంలో ఎరువుల లభ్యత కష్టంగా మారింది. అంతర్జాతీయంగా, దేశీయంగా పెరుగుతున్న ధరల కారణంగా వీటి నిల్వలు పడిపోయాయి. దీంతో పంటకు అవసరమయ్యే ఎరువులు సమయానికి, సరిపడా లభించక రైతన్నలు తీవ్ర కష్ట, నష్టాలను ఎదుర్కొంటున్నారు. ” మార్కెట్‌లో డై-అమ్మోనియమ్‌ ఫాస్పేట్‌ (డీఏపీ) లభించడం లేదు. సాధారణంగా పంటను అమ్మడానికి వెళ్లినప్పుడే రైతులు తమ వెంట తర్వాతి పంట కోసం డీఏపీ ని తీసుకొస్తారు. దీనితో ఇంధన ఖర్చు పొదుపు అవుతుంది. అయితే, ఈ సారి మాత్రం ఖాళీ చేతులతో రావాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని హర్యానాలోని పానిపట్‌ జిల్లాకు చెందిన ప్రీతమ్‌ సింగ్‌ హంజ్రా తెలిపారు. సాధారణంగా, ఒక ఎకరా గోధుమ కోసం రైతులకు దాదాపు 110 కేజీల యూరియా, 50 కేజీల డీఏపీ, 20 కేజీల ఎంఓపీ అవసరం అవుతుంది. ముఖ్యంగా, పంజాబ్‌, యూపీల్లోని ఆలు రైతులకు ఎరువుల కొరత తీవ్ర నిరాశను కలిగిస్తున్నది. దేశంలో ఎరువుల నిల్వలు ఎంత ప్రమాదకరస్థాయికి పడిపోయాయో చెప్పడానికి రైతులు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులే ప్రత్యక్ష ఉదాహరణ అని విశ్లేషకులు తెలిపారు. ముఖ్యంగా, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలే ఈ పరిస్థితికి కారణమని వివరించారు.దేశంలో ఎరువుల ధరలు రైతన్నలను బేంబెలెత్తిస్తున్నాయి. దిగుమతి చేసుకున్న డీఏపీ ధర భారత్‌లో ఇప్పుడు టన్నుకు రూ. 50,648 లకు పైగా (675-680 డాలర్ల మధ్య) ఉన్నది.

 

 

 

 

- Advertisement -

ఇది గతేడాది రూ. 27,762గా (370 డాలర్లు) ఉండటం గమనించాల్సిన అంశం. ఎంఓపీని గతేడాది టన్నుకు రూ. 17,258 (230 డాలర్లు) చొప్పున దిగుమతి చేసుకోగా ప్రస్తుతం అది 37,517కు (500 డాలర్లకు) తగ్గకుండా ధర పలుకుతున్నది. యూరియా కూడా అదే దారిలో పయనిస్తున్నది. దీని ధర దాదాపు రూ. 21,234 (280-285 డాలర్ల) నుంచి రూ. 49,748కి పైగా (660-665 డాలర్లు) పెరిగింది. అలాగే, ఫాస్పారికాసిడ్‌ ధర రూ. 51,699 (689 డాలర్లు) నుంచి రూ. 87 వేలకు పైగా (1160 డాలర్లు), అమ్మోనియా ధర రూ. 17,258 (230 డాలర్లు) నుంచి రూ. 46,896 కు పైగా (625 డాలర్లు), రాక్‌ ఫాస్పేట్‌ ధర రూ. 7,503 (100 డాలర్లు) నుంచి రూ. 11,200కు పైగా (150 డాలర్లు), సల్ఫర్‌ ధర రూ. 6,377 (85 డాలర్లు) నుంచి రూ. 19,500కు పైగా (260 డాలర్లు) పెరగడం గమనార్హంమోడీ ప్రభుత్వం డీఏపీ, ఎన్‌పీకేఎస్‌ కాంప్లెక్సెస్‌ లపై సబ్సిడీని పెంచింది. ఈ మేరకు ఈనెల 12న దీనికి ఆమోదం సైతం తెలిపింది. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ప్రారంభంలో షెడ్యూల్‌ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం సబ్సిడీ నిర్ణయం తీసుకున్నదని విశ్లేషకులు వివరించారు. రైతుల మీద కేంద్రానికి అంత ప్రేమే ఉంటే వివాదాస్పద సాగు చట్టాలను రద్దు చేసేదని తెలిపారు. కాగా, అంతర్జాతీయంగా ధరల పెరుగుతున్న తరుణంలో మోడీ ప్రభుత్వం చాకచక్యంగా నిర్ణయాలు తీసుకోకపోవడం, ధరలను అదుపు చేయలేకపోవడం, ఎరువుల నిల్వలపై దృష్టిని కేంద్రీకరించకపోవడంతోనే ప్రస్తుత పరిస్థితికి కారణమైందని వారు వివరించారు.

 

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags; Manure drought

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page