రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను అమలు చేయాలి-టీడీపీ

0 7,881

-మండలంలో రాస్తారోకోలు,నిరసనలు
-పోలీసుల అదుపులో టిడిపి నాయకులు, కార్యకర్తలు

తుగ్గలి ముచ్చట్లు:

- Advertisement -

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడులకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు రాష్ట్ర బంద్ ను నిర్వహించారు. మండల కేంద్రమైన తుగ్గలి లో మండల అధ్యక్షులు తిరుపాల్ నాయుడు మరియు ఉపాధ్యక్షుడు వెంకటరాముడు చౌదరి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గుత్తి-ఆదోని ప్రధాన రహదారిపై సీఎం డౌన్ డౌన్ అనే నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.డిజిపి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే తెలుగుదేశం పార్టీ జిల్లా కేంద్ర కార్యాలయం పై దాడులు చేయడం చాలా ఘోరమని,అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై మరియు కార్యకర్తలపై దాడులు చేయడం శాంతి భద్రతల విఘాదానికి నిదర్శనమని వారు తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి,అభివృద్ధిపై దృష్టి సాధించకుండా ప్రతిపక్ష నేతల దాడులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధిస్తుందని వారు తెలియజేశారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారుతున్నప్పటికి పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వారు తెలియజేశారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.రాస్తారోకో నిర్వహించడం ద్వారా రోడ్డుకు ఇరువైపులా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర బంద్ పిలుపు మేరకు జొన్నగిరి లోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ కు తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బంద్కు మద్దతు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు.జొన్నగిరి గ్రామంలో రాష్ట్ర బందు నిర్వహిస్తున్న ప్రతిపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వచ్చే ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేష్,మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటస్వామి,అప్పా వేణు, బాలన్న,లక్ష్మీ నారాయణ,గిరిగెట్ల లింగయ్య, సత్య ప్రకాష్,అమీనాబాద్ రమేష్, సర్పంచ్ ఓబులేషు,గిరిగెట్ల మల్లి తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొని రాష్ట్ర బందును విజయవంతం చేశారు.తుగ్గలి మరియు జొన్నగిరి పరిసర ప్రాంతాలలో రాష్ట్ర బంద్ కారణంగా ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా తుగ్గలి ఎస్సై షామీర్ భాష, జొన్నగిరి ఎస్సై రామాంజినేయులు లు తమ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Presidential rule should be enforced in the state-TDP

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page