ప్రైవేటు జూనియర్ కాలేజీ యజమానుల వినతి.

0 7,758

హైదరాబాద్ ముచ్చట్లు:

గత రెండున్నర ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న 315 కోట్ల స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రేవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్య సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు అబిడ్స్ లోని హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కార్యాలయంలో నోడల్ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఎస్సి , ఎస్టీ , బిసి , మైనార్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్ షిప్ లు అధికారుల నిర్లక్యం కారణంగా పెండింగ్ లో ఉన్నాయని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరీ సతీష్ ఆరోపించారు. గత ఎనిమిది నెలలుగా కళాశాలలు నడుపుతున్న భవనాల అద్దెలు , సిబ్బంది జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి , పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Request from private junior college owners

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page