శాస్త్రోక్తంగా శ్రీ‌వారిమెట్టు శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ.

0 7,798

తిరుపతి ముచ్చట్లు:

 

శ్రీ‌నివాస‌మంగాపురం స‌మీపంలోని శ్రీ‌వారి మెట్టు వ‌ద్ద గ‌ల శ్రీ వేంకటేశ్వ‌ర‌ స్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం బుధవారం శాస్త్రోక్తంగా జరిగింది.ఇందులో భాగంగా ఉద‌యం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు మ‌హాశాంతి అభిషేకం, హోమాలు, పూర్ణాహుతి, ఆవాహ‌న, అర్చ‌న నిర్వ‌హించారు. శ్రీ భోగ‌శ్రీ‌నివాస‌మూర్తి ఉత్సవమూర్తిని ప్ర‌తిష్టించారు. ఉద‌యం 11 గంట‌ల‌కు మ‌హాసంప్రోక్ష‌ణ నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మప్రదక్షిణ, జీవకళాన్యాసం, బ్రహ్మఘోష, ఆశీర్వచనం తదితర కార్యక్రమాలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యుడు, కంకణభట్టార్ శ్రీ ఎం.శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, అర్చకులు శ్రీ బాలాజి రంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Scientifically Srivarimettu Sri Venkateswara Swamivari Temple Mahasamprakshana

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page