ఇండో-పాక్‌ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను స్వాధీనం

0 9,859

చండీగఢ్‌ ముచ్చట్లు:

 

పంజాబ్‌లోని ఇండో-పాక్‌ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను పెద్ద ఎత్తున బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్ఎఫ్‌), పంజాబ్‌ పోలీస్‌ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం బుధవారం తార్న్‌ తారన్‌ జిల్లాలోని ఖేమ్‌కరన్‌లో పాక్‌ సరిహద్దుల నుంచి ఆయుధాలను చేసుకుంది. ఈ సందర్భంగా కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ వింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇందర్‌దీప్ సింగ్ మాట్లాడుతూ 22 విదేశీ తుపాకులు, 100 రౌండ్ల మందుగుండు, 44 మ్యాగజైన్లు, కిలో హెరాయిన్‌, 72 గ్రాముల ఓపియంను రికవరీ చేసుకున్నట్లు చెప్పారు.పాక్‌ సరిహద్దుల మీదుగా జీరో లైన్‌ వద్ద సంచిలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యతిరేక శక్తులు సరిహద్దులు దాటి భూభాగంలోకి ఆయుధాలు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం రాగా.. బీఎస్‌ఎఫ్‌తో సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. ఆయుధాలను డ్రోన్ల ద్వారా స్మగ్లింగ్‌ చేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల ఖేమ్‌కరణ్‌ సెక్టార్‌ పాక్‌ నుంచి డ్రోన్‌ కదలికలను గుర్తించారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags: Seizure of weapons smuggled across the Indo-Pak border

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page