శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలి-జిల్లా కలెక్టర్ జి.రవి

0 7,596

జగిత్యాల ముచ్చట్లు:

ఆదికవి శ్రీ వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. బుధవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలలో భాగంగా ఆది కవి వాల్మీకి చిత్రపటానికి పూలమాలవేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బోయవాణిగా జీవితం గడిపిన  వాల్మీకి నారద మహర్షి దివ్యఉపదేశంతో  ప్రపంచ ప్రసిద్ధి పొందిన  రామాయణ మహా గ్రంధాన్ని 23 వేల శ్లోకాలతో, 7 కాండములతో ఆదికావ్యంగా  పూర్తి చేసిన గొప్ప వ్యక్తి శ్రీ మహర్షి వాల్మీకి అని అన్నారు.మనుషుల్లో  మంచి మార్పు వస్తే గొప్ప వారీగా ఎడగడంలో  శ్రీవాల్మీకి మహర్షి మనందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. మన చరిత్రను మలుపు తిప్పిన మహనీయుడు వాల్మీకి మహర్షి అని కొనియాడారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు అనేదానికి వాల్మీకి మహర్షి చరిత్ర నిలువెత్తు నిదర్శనం అని అన్నారు. వాల్మీకి మహర్షిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆదర్శవంతులుగా జీవించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, బిసి వెల్ఫేర్ అధికారి సాయిబాబా , జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి, సూపరిండెంట్లు కలెక్టరేట్ అధికారులు సిబ్బంది, బోయ కుల సంఘ నాయకులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:We should all take the biography of Maharshi as an ideal for Shri Valmiki-District Collector G.Ravi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page