గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన జడ్పీ సీఈఓ శ్రీనివాస రావు

0 75,760

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ సీఈవో గా నూతనంగా నియమితులైన ఎమ్. శ్రీనివాసరావు   నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక  ఎమ్మెల్యే కార్యాలయంలో పూల బొకే తో మర్యాదపూర్వక లాంఛనంగా కలిశారు. ఈ సందర్భంగా  సీఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం అప్పగించిన తన బాధ్యతలు నెరవేరుస్తూ, జిల్లా పరిషత్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. జిల్లా పరిషత్ పరిధిలోని ఆయా మండలాల అభివృద్ధికి పార్టీలకతీతంగా  సేవలందించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నిజాయితీకి నిబద్ధతకు మారు పేరు లా ఉండే విధంగా తన వంతు బాధ్యత రహితమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు. విధినిర్వహణలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ప్రతినిధిగా జిల్లా పరిషత్ అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి మరియు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు అయినటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ని కూడా లాంఛనంగా కలిసి పూల బొకే అందించారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Zadpi CEO Srinivasa Rao meets rural MLA Kotamreddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page