పుంగనూరులో చట్టాలపై అవగాహన పెంచుకోవాలి -జడ్జి వాసుదేవరావు

0 9,695

పుంగనూరు ముచ్చట్లు:

 

 

సమాజంలో ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన పెంచుకుని జీవించడం అలవర్చుకోవాలని పుంగనూరు సీనియర్‌ సివిల్‌జడ్జి వాసుదేవరావు సూచించారు. గురువారం కోర్టు ఆవరణంలో అజాదీకా అమృత్‌ మహోత్సవాలలో భాగంగా న్యాయమూర్తులు కార్తీక్‌, సిందు తో కలసి న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ లోక్‌ అదాలత్‌లో మధ్య వర్తిత్వం ద్వారా సివిల్‌, క్రిమినల్‌ కేసులను పరిష్కరించడం జరుగుతుందన్నారు. కేసులు పరిష్కరించుకోవడంతో సమాజంలో స్నేహ సంబంధాలు బలపడటం జరుగుతుందన్నారు. పేద కక్షిదారులకు ఉచిత న్యాయసేవలు అందించేందుకు అర్హులైన కక్షిదారులు లీగల్‌ సర్వీసస్‌ అథారిటికి ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయవాదులు వీరమోహన్‌రెడ్డి, ఆనందకుమార్‌, సమివుల్లా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ముఖ్యమంత్రిని విమర్శిస్తే బయట తిరగనివ్వం -వాడవాడల జనాగ్రహదీక్షలు

Tags; Awareness should be raised on the laws in Punganur – Judge Vasudeva Rao

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page