ఆలయాల అభివృద్దికి నిధులు

0 8,580

బాన్సువాడ ముచ్చట్లు:

 

రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం లోని రుద్రుర్ మండలం అంభం లక్ష్మీపూర్ క్యాంపు గ్రామంలో శ్రీ రామాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పోచారం శ్రీనివాస్ రెడ్డి కృషితో నిజాంసాగర్ ప్రాజెక్టు కు కాళేశ్వరం జలాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇక ముందు బాన్స్ వాడ నియోజకవర్గంలో నిజాం సాగర్ పై ఆధారపడి పంటలు పండించే రైతులు రెండు పంటలకు సాగునీరు అందే అవకాశం ఏర్పడిందన్నారు. బీర్కూరు మండలం తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయం ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 40 కోట్ల రూపాయల ఖర్చు చేసిందని చెప్పారు. తిరుమల తిరుపతి దేవాలయం లాగానే తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా కృషి చేశారని వివరించారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Funds for the development of temples

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page