సానుభూతిపై ఆశలు

0 7,761

విజయవాడ ముచ్చట్లు:

87757
ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడ వచ్చు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. అలాగని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం సరికాదు. అదీ రాజకీయాల్లో అసలు మంచిది కాదు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. అనుభవం, వయసు పరంగా పట్టాభి ముఖ్యమంత్రి పై చేసిన కామెంట్స్ ను అందరూ తప్పుపట్టాల్సిందే. దానిని ఖండించకపోగా తనను చంపేస్తారంటూ పట్టాభి మరో డ్రామా మొదలు పెట్టారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిర్మాణాత్మకమైన విమర్శలు ఎన్నైనా చేయవచ్చు. అవినీతి జరిగితే ఆధారాలతో వాటిని బయటపెట్టవచ్చు. నిజంగా ఆధారాలుంటే న్యాయస్థానాల ద్వారానైనా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టొచ్చు. కానీ పట్టాభి గత కొద్ది రోజులుగా డ్రగ్స్ వ్యవహారంపై నిరాధార ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. కేవలం ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమాన్ని పార్టీ పట్టాభికి అప్పగించినట్లే కన్పిస్తుంది. పని ఉన్నా లేకపోయినా ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం పట్టాభికి అలవాటుగా మారింది.ముఖ్యమంత్రిని అనకూడని మాటలు అని చివరకు తనను చంపేయడానికి కుట్రలు చేస్తున్నారని పట్టాభి ఆరోపిస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత పట్టాభికి గుర్తుకులేదేమో. అసలు స్థాయిని ఎవరూ మర్చి పోకూడదు. ఉన్నట్లుండి ఎదగాలన్న కాంక్షతోనే ఇలాంటి పట్టాభిలు ప్రతి పార్టీలో ఉంటారు. వారిని రాజకీయ పార్టీలు ముందుగానే గుర్తించి ఏరివేయకపోతే పార్టీలే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.పట్టాభి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ తమ కార్యాలయాలపై దాడులు చేసిందని, తమకు సానుభూతి వస్తుందని టీడీపీ ఆనందపడవచ్చు. ఇది ఒకరోజు ఉండే రచ్చ మాత్రమే. చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడిని జనం మర్చిపోయారు. అందుకే ఇలాంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా పార్టీ అధినేతలే చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పట్టాభి లాంటి నోటి మీద కంట్రోల్ లేని నేతలను పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే భవిష్యత్ లోనూ ఇలాంటి ఘటనలే జరగక మానవు.

 

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Hopes on sympathy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page