పోలీసు అమరుల త్యాగాలను స్మరించు కోవడం  మన బాధ్యత.-ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి

0 7,577

నెల్లూరు    ముచ్చట్లు:

శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల సేవలు మరువలేనివని రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. నెల్లూరు పోలీసు పరేడ్‌ మైదానంలోబుధవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా ఎస్పీ విజయ రావు, జిల్లా కలెక్టర్ కె వి ఎన్ చక్రధర్ బాబు, జిల్లా జడ్జి యామిని, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావాలి ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిలతో కలిసి అమర వీరుల స్తూపం వద్ద ఆయన నివాళులర్పించారు. అనంతరం సిబ్బంది నుంచి గౌరవవందనంస్వీకరించారు.ఈ సందర్భంగా బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ,సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు సెలవులు,పండుగలు లేకుండా 24 గంటలు విధులు నిర్వర్తిస్తూ శాంతి భద్రతలు పరిరక్షిస్తున్నారని ప్రశంసించారు.అమర వీరుల కుటుంబాలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు  మరువలేమని,వారిని స్మరించుకోవడం అందరి బాధ్యత. నేర పరిశోధన,ప్రజలసంరక్షణలో పోలీసుల సేవలు అజరామమం మన కళ్ల ముందు నిత్యం ఏ కష్టం కలిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీసు, ఖాకీ డ్రస్‌ ఖరుకు దనం ఉన్న వెనుకాల ఉన్నది.

- Advertisement -

మనిషే కాబట్టి, వారందరికీ మర్యాద, గౌరవం, విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. నిత్యం పోలీసులు చేస్తున్న పోరాటాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తున్నాం అని అన్నారు. వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి, దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలు అంకితం చేసిన వారందరికీ పాదాభివందనమన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విజయరావు మాట్లాడుతు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ ప్రాణాలుకోల్పోయిన పోలీసు అమర వీరుల త్యాగాలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరంఉందని పేర్కొన్నారు.శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర,వారు చూపే చొరవ విశేషమైందని ఆయన కొనియాడారు.విధుల్లో ప్రాణాలు కోల్పోయిన అమరులను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబరు 21వతేదీన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని లాంఛనంగా నిర్వహించుకుంటున్నట్లుతెలిపారు.ఇందులో భాగంగా జిల్లాలో జరిగే వారోత్సవాల్లో పోలీస్ సిబ్బంది అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ బాధితులకు న్యాయం చేయటంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ పోలీసులు భాగస్వాములు కావాలని ఆయనసూచించారు.

సమాజానికి ఉత్తమ సేవలను అందిస్తూ ప్రజల నుంచి మన్ననలను పొందేందుకు విశేష కృషి చేయాలన్నారు.శాఖాపరమైనవిషయాల్లో నిజాయితీగా వ్యవహరిస్తూ అధికారుల మన్ననలు పొందాలని పేర్కొన్నారు.ప్రజారక్షణలోపోలీసులత్యాగాలువెలకట్టలేనివని ప్రజల రక్షణకు అహర్నిశలు శ్రమించే పోలీసుల పాత్ర వెలకట్టలేనిదన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం త్యాగం చేస్తున్న వారి సేవలు మరువలేనివన్నారు.
ఈ సందర్భంగా జిల్లా జడ్జి యామిని మాట్లాడుతూ అసువులు బాసిన భరత మాత ముద్దుబిడ్డలందరికీ జోహార్లు, ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కాపలా ఉంటారని, ఎండా, వాన, పగలు, రాత్రి అని తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండుగ పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి మరణించే పోలీసులకు అందునా ప్రాణాలని ఫణంగా పెట్టి, ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడంమనందరిబాధ్యత అన్నారు.భవిష్యత్‌లో పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధినిర్వహణలోనూ తనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం ప్రధాన ఉద్దేశం అని ఆమె పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ప్రొటెర్మ్  చైర్మన్ విఠపు, జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి,ప్రముఖులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:It is our responsibility to commemorate the sacrifices of the police martyrs.-Emlsi Bally Kalyan Chakraborty

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page