కిరణ్ అబ్బవరం హీరోగా న‌టిస్తోన్న‌ ‘సమ్మతమే’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల.

0 7,763

 

సినిమా  ముచ్చట్లు:

- Advertisement -

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్న కథలను ఎంచుకుంటున్నారు. మెద‌టి చిత్రం
రాజా వారు రాణి గారు రస్టిక్ అండ్ రొమాంటిక్ డ్రామా కాగా.. రెండో చిత్రం ఎస్ఆర్ కళ్యాణమండపం రొమాంటిక్ యాక్షన్ డ్రామా. ఆ రెండూ కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ `సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతోన్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా  ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను ఈరోజు మేకర్స్ విడుదల చేశారు. హీరో హీరోయిన్ల కారెక్టర్‌లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. హీరో కిరణ్ అబ్బవరం సైలెంట్, కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.. హీరోయిన్  చాందినీ చౌదరి మాత్రం మందు కొడుతూ, దమ్ము కొడుతూ చిల్ అవుతోంది.
పాటలతో ఎదుటివారి  ఫీలింగ్స్‌ను బయటపెట్టడంతో ఆడియెన్స్‌కు కొత్త ఫీలింగ్ వస్తోంది. కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి జోడి అందరినీ ఆకట్టుకునేలా ఉంది. డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సరికొత్త ప్రేమకథతో రాబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ ఫస్ట్ గ్లింప్స్‌తో పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. సతీష్ రెడ్డి మాసం సినిమాగ్ర‌ఫి, శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాయి.
యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న సమ్మతమే షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇంకో షెడ్యూల్ మాత్రమే బ్యాల‌న్స్ ఉంది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.
నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి తదితరులు.

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:Kiran Abbavaram is seen as the hero in ‘Sammatame’ First Glimps release

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page