ఆర్థర్ రోడ్డు జైలుకు వచ్చిన షారుక్‌

0 9,261

-తనయుడిని కలిసి వెంటనే వెళ్లిపోయిన నటుడు

 

ముంబయి ముచ్చట్లు:

 

 

- Advertisement -

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన తన కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను చూసేందుకు గురువారం బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ ముంబయిలోని ఆర్థర్ రోడ్డు జైలుకు వచ్చారు. తనయుడితో కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. ఆయన పోలీసులు అదుపులో ఉన్న ఆర్యన్‌ను కలుసుకోవడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 2న అరెస్టయిన ఆర్యన్ బెయిల్ కోసం పలుమార్లు అభ్యర్థనలు పెట్టుకున్నారు. అయితే, ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం వాటిని తోసిపుచ్చింది. నిన్న కూడా బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారుడిని చూసేందుకు షారుక్‌ జైలుకు వచ్చారు. గతవారం ఆర్యన్ తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే.

 

 

 

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో అక్కడి ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దీంతో జైల్లో ఉన్న వ్యక్తులు తమ వారిని కలుకునేందుకు వీలుకలిగింది. ఇప్పుడు ఇద్దరు కుటుంబ సభ్యులు ఖైదీలను కలవొచ్చు. ఈ వెసులుబాటు అనంతరమే షారుక్‌ కుమారుడిని కలుసుకునేందుకు వచ్చారు. కేసు విచారణలో భాగంగా షారుక్ మేనేజర్, న్యాయవాదులు ఆర్యన్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే ప్రత్యేక న్యాయస్థానం పలుమార్లు బెయిల్ నిరాకరించడంతో ఆర్యన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నారు.

ముఖ్యమంత్రిని విమర్శిస్తే బయట తిరగనివ్వం -వాడవాడల జనాగ్రహదీక్షలు

Tags; Shahrukh arrives at Arthur Road Jail

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page