పోలీసు ఉద్యోగం మహోన్నతమైనది.

0 7,581

రాజన్న సిరిసిల్ల  ముచ్చట్లు:

చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకొని అమరులైన పోలీసులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే లు ఘనంగా నివాళులర్పించారు,ఈ సందర్బంగా కలెక్టర్,ఎస్పీ లు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను మారువలేనివాని, ప్రాణాలను ఫణంగా పెట్టి విధులను నిర్వర్తించే పోలీస్ ఉద్యోగం మహోన్నతమైనదని,శాంతి భద్రతలను పరిరక్షించడంలో మన పోలీసు యంత్రాంగం చేస్తున్న కృషికి దేశ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చిందని అన్నారు. ప్రజలకు భద్రత కల్పించడం కోసం పోలీసులు ఎన్నో సమస్యలను, సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొంటూ విధులు నిర్వర్తించడం అభినందనీయం అని పేర్కొన్నారు. వారి త్యాగాల స్పూర్తితో పోలీసులు తమ విధులను సక్రమంగా మరింత అంకితభావంతో, కర్తవ్యంతో నిర్వర్తించాలని సూచించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన వారి త్యాగం వెలకట్టలేనిదని ఆయన అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు.మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ శాఖ శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సమాజహితానికి, మంచి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి త్యాగాలను స్పూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.అమరులైన కుటుంబాలకు సంబందించిన కుటుంబ సభ్యులు  హాజరై నివాళ్ళు అర్పించడం జరిగింది. కలెక్టర్ ,ఎస్పి లు  త్యాగమూర్తుల కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి కుటుంబ పరిస్థుతులు వారి యొక్క సమస్యలను అడిగి వారు చెప్పిన సమస్యలను సాద్యమైనoత తొందరగా పరిష్కరిస్తాం అని తెలిపారు.అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు చంద్రశేఖర్, చంద్రకాంత్, సి.ఐ లు శ్రీలత, మోగిలి, బన్సీలాల్, నవీన్ కుమార్, సర్వర్, అనిల్ కుమార్ గారు,ఆర్.ఐ అడ్మిన్ కుమారస్వామి,రజినీ కాంత్ గారు, ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

నూతన వధువరులను ఆశీర్వధించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Tags:The police job is outstanding

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page