వంగలపూడి గ్రామంలో ఐరన్ ఫినిషింగ్ తోనే సిసి రోడ్డు ఆక్రమణ

0 9,256

– న్యాయం జరిపించాలంటూ అధికారులను వేడుకుంటున్న స్థానికులు

 

రాజానగరం ముచ్చట్లు:

 

- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగలపూడి గ్రామపంచాయతీ విజయ దుర్గ స్కూల్ సమీపంలో నివసిస్తున్న రాయుడు.తాతబ్బాయి,ఉండవల్లి రామకృష్ణ అను వారి కుటుంబీకులను ఉత్తరం వైపు పంచాయతీ నిధులతో 2012 – 2013 వ సంవత్సరంలో పంచాయతీ వారు 1,74,469 రూ” నిధులతో మూడు మీటర్ల వెడల్పు,83.30 పొడవు కలిగిన సి సి రోడ్డు నిర్మాణం చేపట్టగా కొందరు అక్రమంగా ఐరన్ ఫినిషింగ్ వేసి సిసి రోడ్డు ఆక్రమణ చేశారని స్థానికులు ఆవేదన చెందిన వైనం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కూచిపూడి.వెంకటరత్నం,కూచుపూడి. బాబురావు(చిట్టియ్య),కూచిపూడి.భాస్కర్ రావు అనువారు ఈ సి సి రోడ్డు మాకే సొంతం అంటూ దౌర్జన్యానికి దిగుతున్నారని స్థానికులు అంటున్నారు. సి సి రోడ్డు మరియు పంచాయతీ డ్రైనేజీ కొరకు నిర్ధేశించిన స్థలాన్ని కూడా ఆక్రమించుకుని మట్టితో మెరక చేసి ఐరన్ ఫినిషింగ్ వేసి ఆక్రమించుకోవడం ఇదేం చోద్యం అంటున్నారు గ్రామస్తులు. ఈ సి సి రోడ్డు పై తిరగనివ్వం అంటూ ఆంక్షలు విధిస్తూ,పలు రకాల భయభ్రాంతులకు,బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు అంటున్నారు. ఈ ధోరణి సరైనది కాదని స్థానిక విఆర్వో తెలియజేసినా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరనీ,మాకు పై స్థాయి నుంచి అండదండలు ఉన్నాయనిఅనడం సరికాదని పలు ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. ఈ పంచాయతీ రోడ్డును వాడుకోవడం కుదరదంటూ అడ్డుపడుతున్న వారిపై స్థానిక ఎమ్మార్వో,స్థానిక ఎంపిడిఓ,జిల్లా అధికారులు పూర్తి సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని రాయుడు.సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాయుడు.ఇంద్ర, ఉండవల్లి.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; CC road occupation with iron finish in Vangalapudi village

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page