హుజురాబాద్‌ ఉప ఎన్నికలకు 20 కంపెనీల కేంద్ర బలగాలు

0 5

హైదరాబాద్‌  ముచ్చట్లు:

 

హుజురాబాద్‌ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ తగు జాగ్రత్తలను తీసుకుంటున్నది. అందులో భాగంగా ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు ఒకటి, రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్‌కు 3 కంపెనీల బలగాలు చేరుకున్నాయి.హుజూరాబాద్‌లో ఇప్పటివరకు రూ.1.80 కోట్ల నగదు, రూ.6.11 లక్షల విలువైన మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఉప ఎన్నిక నిర్వహణ కోసం మరో వ్యయ పరిశీలకుడిని ఈసీ నియమించింది.కాగా, ఇప్పటివరకు మొదటి డోస్ కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న ఓటర్లు 97.6 శాతం కాగా, 2వ డోస్ వ్యాక్సినేషన్ తీసుకున్న ఓటర్లు 59.9 శాతంగా నమోదైంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి దాదాపు వంద శాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయి అయినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

- Advertisement -

బాబు జిమ్మిక్కులను సాగనివ్వం

Tags; Central forces of 20 companies for Huzurabad by-election

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page