ఫామ్ హౌజ్ పాలన కావాలా ?ప్రజాస్వామ్య పాలన కావాలా ?

0 7,560

హుజూరాబాద్ ముచ్చట్లు:

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం. బుజునురు గ్రామంలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమాంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గోన్నారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఫామ్ హౌజ్ పాలన కావాలా?  ప్రజాస్వామ్య పాలన కావాలా అని ప్రశ్నించారు. అబద్దం ముందు పుట్టి కెసిఆర్ కుటుంబం తరువాత పుట్టింది. పెట్రోలు ధరలు ప్రపంచ ధరలకు అనుగుణంగా పెంచాలి అని నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్. అప్పుడు కెసిఆర్ వారితో కలిసే ఉన్నారు కదా. దళిత బంధు  ఒక్కరోజులో అందరికీ ఇవ్వాలి. కెసిఆర్ మాటమీద నిలబడే వ్యక్తి కాదు. మడమ తిప్పే వ్యక్తి. దళితబంధు పథకం రావడానికి కారణం ఈటెల రాజేందర్.  దళిత బంధు పథకానికి “ఈటల రాజేందర్ దళిత బంధు” అని పేరు పెట్టాలి.  అబద్ధాలు ఎక్కువ రోజులు నమ్మరు. తెలంగాణ ప్రజలు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇప్పుడు కెసిఆర్ నియంతృత్వం కి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు.  ముఖ్యమంత్రి కుర్చీ ఎడమకాలి చెప్పుతో సమానం అన్న సీఎం కెసిఆర్ కి ప్రజల మధ్యకి వచ్చి ఓట్లు అడిగే నైతికత లేదు.  తెలంగాణలో అవినీతి, అక్రమ పాలన, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని అన్నారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ కెసిఆర్,   మీకు సీఎం పదవి మీ తాత, తండ్రి ఇవ్వలేదు.  ప్రజల ఓట్లకు పుట్టింది.  కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని సమాజం భావిస్తుంది.  కెసిఆర్ నిజస్వరూపం తేల్చిచెప్పే నియోజకవర్గం హుజూరాబాద్.  మంత్రిగా కాదు కనీసం మనిషిగా అయినా గుర్తించు అని అడిగినా. ప్రజలకోసం మంత్రి పదవి వదులుకోవడానికి సిద్దం అయిన వాడిని నేను.  దళిత బందుకు కారణం హుజూరాబాద్ ఉప ఎన్నిక.  ఈ పథకానికి 2 లక్షల కోట్లు అవుతాయి.. అయిన ఇస్తాం, రాజు తలుచుకుంటే దెబ్బలు కొదువనా అని చెప్పింది కెసిఆర్ అని అన్నారు.
ఈ పథకాన్ని మొదటగా స్వాగతించింది నేను. ద్రోహి నా మీద దొంగ ఉత్తరం పుట్టించారు. అది తప్పుడు లేఖ అని ఎన్నికల కమీషన్ చెప్పింది కదా.  దళిత బంధు ఆపాలని లేఖ రాయలేదు అని నేను పోచమ్మ గుడికి వస్తా కేసిఆర్ నువ్వు వస్తావా?  దళిత బంధు తెలంగాణ అంతా అమలు చేయించడమే నా మొదటి యుద్ధం.  30 వ తేదీ తరువాత అదే పని నాకు. తాగి వచ్చి నేతలు ఓటు వేయాలని బూతులు తిడుతున్నరనీ వంతడపుల దళిత మహిళలు బాధ పడుతున్నారు. 2023 లో తెలంగాణలో ఎగిరెది కాషాయ జెండానే.  30 వ తేదీ తరువాత అసెంబ్లీ లో కనిపించే మొఖం నాదే, కెసిఆర్ ది కాదు. తేల్చుకుందాం.  నేను గెలిస్తే ప్రజల గౌరవం నిలబడుతుందని అన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Do you want a farm house rule? Do you want a democratic rule?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page