ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి . ఎస్ ఎఫ్ ఐ

0 9,659

బేతంచర్ల ముచ్చట్లు:

 


పట్టణంలో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ తూర్పు ప్రాంతం జిల్లా ఉపాధ్యక్షుడు యం.మధు శేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు స్థానిక పట్టణంలోని పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులతో వారు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బేతంచర్ల పట్టణంలో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసేంత వరకు మనమంతా కలిసి పోరాడాలన్నారు. పట్టణంలో ఉన్న ఒక్క ఎయిడెడ్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం వల్ల విద్యార్థులకు మరింత ఫీజుల భారం పడింది అన్నారు. పట్టణంలో  ఇంటర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిన తర్వాతనే పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాలను ప్రవేట్ పరం చేయాలన్నారు. అంతవరకూ పాణ్యం సిమెంట్ జూనియర్ కళాశాలను ఎయిడెడ్ గానే కొనసాగించాలని వారు కోరారు. తక్షణమే ప్రభుత్వము, ఎమ్మార్వో గారు స్పందించి పట్టణంలో ప్రభుత్వ ఇంటర్ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో పట్టణంలో విద్యార్థులంతా కలిసి ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వన్నూర్ వలి, నాగరాజు, భాష, నరసింహులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags; Government Inter Degree College should be set up. SFI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page