అటవీ భూములను పరిరక్షించాల్సిన  భాద్యత అధికారులదే

0 9,694

-అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

ములుగు ముచ్చట్లు:

- Advertisement -

పొడు భుములకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శుక్రవారం రోజున ములుగు జిల్లా పర్యటనలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొoగ్దు, సిఎం  ఓఎస్డి ప్రియాంక వర్గిస్ , పి సి సి ఎస్ శోభ, అదనపు పి సి సి ఎఫ్ మోహన్ చంద్ర లు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లాకు విచ్చేసిన వీరికి జిల్లా పాలనాధికారి క్రిష్ణ ఆదిత్య స్వాగతం పలికారు.  అనంతరం కలెక్టర్ కార్యాలయంలో ములుగు, భూపాల్ పల్లి, వరంగల్, మహబూబాబాద్, జిల్లాలకు సంబంధించిన పోడు భూములు సమస్యలు  అడవుల పరిరక్షణ హరితహారం అంశాలపై ఆయా జిల్లాల జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్ డి వోలు, అటవీశాఖ అధికారులు, డి ఎఫ్ఓ  లు , రెవెన్యూ మరియు గిరిజన సంక్షేమ శాఖ అధికారుల తో సమీక్ష సమావేశం  నిర్వహించారు .
ఈ సమీక్ష సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అటవీ భూములను పరిరక్షించాల్సిన  భాద్యత అధికారులదేనని, ములుగు, భూపాల్ పల్లి, వరంగల్, మహబూబాబాద్  జిల్లా లో అటవీ ప్రాంతం ఎక్కువ గా ఉన్నదని, ఏ ఏ తెగలు నివాసం ఉంటున్నారని, ఇకనుంచి ఎకరం కూడా అటవీ ప్రాంతం ఆక్రమణకు గురికాకుండా చూడలని ,  ప్రభుత్వ ఆదేశాల మేరకు  యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. అటవీ రెవెన్యూ గిరిజన సంక్షేమ శాఖ అధికారుల సమన్వయంతో వ్యవహరించాలని, ఇప్పటికే పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి గతంలో  ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఇంకా ఎంత మందికి ఎన్ని ఎకరాలకు పట్టాలు అందించారు అనే దానిపై  సమగ్ర సమాచారం అందించాలని అన్నారు. పోడు సాగుదారులకు న్యాయం చేయాలనే  అంశాలపై  రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆలోచన చేస్తున్నారని దానికి అనుగుణంగా చిత్తశుద్ధితో పని చేయాలని చెప్పారు.

 

 

 

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చాంగ్తుమాట్లాడుతూ పోడు భూముల అడవుల సంరక్షణ హరితహారం సంబంధిత విషయాలపై ప్రభుత్వ నియమ నిబంధనలు ఆర్ వో ఎఫ్ ఆర్ యాక్ట్ లో ఉన్న అంశాలను తూచా తప్పకుండా పాటించాలని వారు  అన్నారు. పోడు భూముల  సమస్యలపై ,పీసా చట్టం కింద ఏయే గ్రామాలు ఉన్నాయి, గ్రామ సభల ద్వారా సమస్యలను  పరిష్కరించాల్సి ఉందని వారు అన్నారు.    ఈ సందర్భంగా  సిఎం ఓస్ డి  ప్రియాంక వర్గిస్ మాట్లడుతూ  ములుగు భూపాల్ పల్లి ,వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో అటవీ భూమి ఎక్కువగా ఉన్నందున ఫారెస్ట్ భూములు మరియు రెవెన్యు భూములను కాపాడవలసిన భాద్యత అధికారులదని పోడు భూముల విషయంలో ప్రజలను ఇబ్బదులకు గురిచేయవద్దన్నది సియం  ఆకాంక్ష అని వారు అన్నారు. ప్రజలకు నచ్చజెప్పి  వారి జివనోపాదికి ఇబ్బంది లేకుండా వారికీ నచ్చ జెప్పే ప్రయత్నం చేయాలని, అన్నారు. ఈ పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారంచూపాలని వారు అన్నారు.

 

 

ములుగు, భూపాల్ పల్లి వరంగల్, మహబూబాబాద్ జిల్లాల  జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల్లో ఉన్న అటవీ విస్తీర్ణం పోడు భూములు సమస్యలు, హరితహారం సంబంధిత విషయాలపై  ఉన్నతాదికరులకు  వివరిస్తూ పై అధికారుల ఆదేశాల తూచా తప్పకుండా పాటిస్తూ సమర్థవంతమైన పాలన లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. అటవీ ,రెవెన్యూ చట్టాలతో పాటు అటవీ పరిరక్షణ కు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తూoదనే నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ దిశ గా సమాలోచనలు చేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో ములుగు, భూపాల్ పల్లి , వరంగల్ ,మహబూబాబాద్ , జిల్లాల కలెక్టర్లు, ఎస్. క్రిష్ణ ఆదిత్య, గోపి, శేశాంక్   జిల్లాల అదనపు కలెక్టర్లు, డిఎఫ్ ఓ లు, ఆర్డీఓలు, డిటిడిఓ లు, తహశీల్దార్లు, ఎఫ్ ఆర్ ఓ లు, తదితరు లు పాల్గొన్నారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: It is the responsibility of the authorities to protect the forest lands9

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page