చంద్రబాబు నాయుడు దీక్ష కు జేసీ ప్రభాకర్ రెడ్డి మద్దతు

0 9,842

-సంఘీభావం తెలుపుతూ దీక్షలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి

 

విజయవాడ ముచ్చట్లు:

 

- Advertisement -

తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి విజయవాడలోని టిడిపి కార్యాలయంలో  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న 36 గంటల దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.
చంద్రబాబు నిర్వహిస్తున్న దీక్షకు ఆయన హాజరై సంఘీభావం తెలియజేశారు. దీక్షాస్థలికి జేసీ ప్రభాకర్ రెడ్డి చేరుకోగానే టిడిపి కార్యకర్తలు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ చుట్టుముట్టారు. జెసిపిఆర్ తో సెల్ఫీలు దిగడానికి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎగబడ్డారు… చంద్రబాబు నాయుడు దీక్ష లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. దీక్షలో పాల్గొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి తనను కలసిన పత్రికేయులతో మాట్లాడుతూ ఏకంగా  టిడిపి కార్యాలయం పైన వైకాపా మద్దతుదారులు  దాడి చేయడం హేయమైన చర్యగా జేసీ ప్రభాకర్ రెడ్డి అభివర్ణించారు.గతంలో కూడా  తాడిపత్రి లోని తన ఇంటి పై వైకాపా నాయకులు  దాడి చేసిన విషయాన్ని ప్రజాస్వామ్య వాదులు ఎవరు మర్చిపోలేదు అన్నారు. భౌతిక దాడులకు పాల్పడ్డాలనే ఉద్దేశంతో  సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన తన ఇంటిపైనే వైకాపా నాయకులు దాడికి తెగబడ్డారని ఆయన విమర్శించారు.  మా జెసి సోదరులు ఇంట్లో లేకున్నా  ఆత్మవిశ్వాసం కలిగిన టిడిపి కార్యకర్తలతో పాటు, గుండె ధైర్యం గల యువకులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి వారి ఆగడాలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన విషయాన్ని తెలియజేశారు.  దీంతో వైకాపా నాయకులు వెనుకకు  తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. టిడిపి కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడి ప్రజాస్వామ్య  వ్యవస్థకు విఘాతం కలిగిస్తోందని జెసి స్పష్టం చేశారు. డెమోక్రసీ ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఆంధ్ర ప్రజానీకంపై ఎంతైనా ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రభుత్వంపై  తిరగబడే రోజు తొందరలోనే ఉందని జెసి హెచ్చరించారు.  ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేకత దృష్టి మళ్ళించడానికి వైకాపా కార్యాలయాలు , నాయకులపై దాడులు చేస్తున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Jesse Prabhakar Reddy supports Chandrababu Naidu’s initiation

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page