బాబు జిమ్మిక్కులను సాగనివ్వం

0 9,813

పుంగనూరు ముచ్చట్లు:

 

రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గంలో జనాగ్రహదీక్షలు శుక్రవారం రెండవ రోజు నిర్వహించారు. అన్ని మండల కేంద్రాల్లోను నాయకులు చంద్రబాబు, పట్టాబిల దిష్టిబొమ్మలు దగ్ధం చేసి, నిరసన దీక్షలు నిర్వహించారు. వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు జిమ్మిక్కులను సాగనివ్వమని, రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చేస్తే కనుమరుగైపోతారని హెచ్చరించారు.

 

- Advertisement -

పుంగనూరు….

పట్టణంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌ విగ్రహం వద్ద జనాగ్రహ దీక్షలను వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, రాష్ట్రజానపదకళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు , పట్టాబిల దిష్టిబొమ్మలను కాల్చి నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో జెడ్పిటిసి జ్ఞానప్రసన్న, వైఎస్‌ఆర్‌సిపి జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, కెఎస్‌ఏ.ఇఫ్తికార్‌ అలీ అహ్మద్‌,ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి , మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు సిఆర్‌.లలిత, నాగేంద్ర తో పాటు మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, మాజీ ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, కౌన్సిలర్లు అమ్ము, కిజర్‌ఖాన్‌, అర్షద్‌అలి, నరసింహులు, రేష్మా, కుమారి, భారతి, మమత, కాళిదాసు, జెపి యాదవ్‌, నటరాజ తో పాటు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

చౌడేపల్లెలో…

మండల కేంద్రంలోని బస్టాండులో ఎంపిపి గాజులరామ్మూర్తి, జెడ్పిటిసి దామోదర్‌రాజు, వైస్‌ఎంపిపి నరసింహాయాదవ్‌, బోయకొండ ఆలయ కమిటి చైర్మన్‌ మిద్దింటి శంకరనారాయణ, కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌, సింగిల్‌విండో చైర్మన్‌ రవిచంద్రరెడ్డి , మాజీ ఎంపిపి అంజిబాబు, రెడ్డిప్రకాష్‌ , రుక్ష్మిణమ్మ ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు.


సోమలలో..

సోమల మండల కేంద్రంలో ఎంపిపి ఈశ్వరయ్య, వైస్‌ ఎంపిపి ప్రభాకర్‌, మండల పరిశీలకులు నాగరాజారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకటేశ్వరరావు, పార్టీ అధ్యక్షుడు గంగాధర్‌, మాజీ ఏఎంసీ చైర్మన్లు నాగేశ్వరరావు, మోహన్‌ కలసి నిరసన దీక్షలు నిర్వహించారు. దీక్షల్లో పార్టీ నాయకులు మస్తాబ్‌సాబ్‌, వెంకటేష్‌, శీలంభాస్కర్‌, పిఎల్‌ఆర్‌.రాజారెడ్డి, నాగభూషణం, వరదం వెంకట్రమణ తదితరులు పాల్గొన్నారు.

సదుంలో….

సదుం మండల కేంద్రంలో ఎంపిపి యల్లప్ప, జెడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించి, చంద్రబాబు, పట్టాబిల దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి, దగ్ధం చేశారు.

రొంపిచెర్లలో…

రొంపిచెర్ల మండల కేంద్రంలో ఎంపిపి పురుషోత్తం, జెడ్పిటిసి రెడ్డీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహిం, హరినాథరెడ్డి, చెంచురెడ్డి, సలీంబాషా, విజయశేఖర్‌బాబు, సూర్యనారాయణరెడ్డి, కోటా వెంకట్రమణ, యుగంధర్‌రెడ్డి పాల్గొన్నారు.

 

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Let Babu stretch the gimmicks

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page