న‌వంబ‌రు 9న మిక్స్ డ్‌ రైస్‌ టెండర్‌ మరియు వేలం

0 9,687

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన 11, 040 కిలోల మిక్స్ డ్ బియ్యం న‌వంబ‌రు 9వ తేదీన టెండర్‌ మరియు వేలం వేయనున్నారు.ఆసక్తి కలవారు న‌వంబ‌రు 9వ తేదీలోపు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ. 3,000/- డిడి తీసి సీల్డ్‌ టెండర్‌తో పాటు తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం, జనరల్‌ మేనేజర్‌(వేలం) కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు సాయంత్రం టెండర్లను తెరవడం జరుగుతుంది.ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, నంబర్లో కార్యాలయం వేళల్లోను, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించగలరు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Mixed rice tender and auction on November 9

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page