కర్నూలుకు సంజీవయ్య పేరు పెట్టండి

0 7,881

కర్నూలు   ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త డిమాండ్ తెరమీదకి వచ్చింది. కర్నూలు జిల్లా పేరు మార్చాలంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ ఇవాళ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటి వరకూ అంతటి మహనీయుని పేరు ఒక్క ప్రభుత్వ పథకానికీ పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరు మార్చకపోతే, అధికార మార్పిడి తర్వాత ఆ పని జనసేన పార్టీ చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.తమ పార్టీ ప్రయాణం, ఆశ‌యాల వెనుక కొంద‌రు స్ఫూర్తిప్రధాత‌లు ఉన్నార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పుకొచ్చారు. దామోదరం సంజీవయ్యతోపాటు వారిలో బూర్గుల రామ‌కృష్ణా‌రావు మరొక‌ర‌ని వపన్ తెలిపారు. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డ స‌మ‌యంలో తెలుగు వారంద‌రూ ఒక్కటిగా ఉండాల‌ని చెప్పార‌ని పవన్ గుర్తు చేశారు. ఆ క్రమంలో ఆయ‌న ముఖ్యమంత్రి ప‌ద‌విని సైతం వ‌దులుకున్నార‌ని పవన్ అన్నారు. అటువంటి మ‌హానుభావులే జనసేన పార్టీకి స్ఫూర్తిప్రధాత‌ల‌ని పవన్ చెప్పారు.అంతేకాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన అనేక సంస్కర‌ణ‌లు తీసుకొచ్చిన మహానుభావులు పీవీ న‌ర‌సింహారావు అని ప‌వ‌న్ తెలిపారు. ఎన్నో భూ సంస్కర‌ణ‌లు ప్రవేశ‌పెట్టార‌ని.. ప్రధాన‌మంత్రి అయిన త‌ర్వాత ఆర్థిక సంస్కర‌ణ‌లు ప్రవేశ‌పెట్టి దేశాన్ని మరోదశకు తీసుకెళ్లారని పవన్ కొనియాడారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

 

Tags:Name Kurnool Sanjeevaya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page