నెల్లూరు రెడ్ క్రాస్ స్పాస్టిక్ సెంటర్  ఆధునిక వసతుల కల్పన.

0 7,758

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎమ్మెస్సార్ స్పాస్టిక్ సెంటర్లో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఆధునిక వసతులు కల్పించినట్లు నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ పి.చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతిరోజూ పిల్లలందరకీ మధ్యాహ్నం ఉచిత పౌష్టికారంతో పాటు,  ఉదయం &  సాయంత్రం స్నాక్స్, సాయంత్రం పాలు అందించే కార్యక్రమం, అలానే పిల్లలoధరకీ ఉచిత ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయడం, ప్రతి నెల మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి పిల్లలకు ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమాలు ప్రారంభo.                                                    ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ చంద్ర శేఖర్ రెడ్డి  మాట్లాడుతూ
ఇకపై రెడ్ క్రాస్ ఎమ్మెస్సార్ స్పాస్టిక్స్ సెంటర్ విధ్యార్ధులందరికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని తెలియదు చేశారు .
ప్రతిరోజూ ఉదయం పూట స్నాక్స్, మధ్యాహ్నం పౌష్టికాహారం, సాయంత్రం పాలు, పండ్లు ఉచితంగా పిల్లలకు ఇచ్చే కార్యక్రమl ప్రారంభించడo ద్వారా . శారీరకంగా, మానసికంగా కొంత బలహీనంగా ఉండే విధ్యార్ధులకు రోజుకు 3 సార్లు ఇలా ఇచ్చే ఆహారంతో విధ్యార్ధులు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలియచేసారు. అలానే వారిలో ఉత్సాహం నింపేందుకు డాన్స్, మ్యూజిక్ లాంటి కళలను  నేర్పించేందుకు టీచర్లను ఏర్పాటు చేయడం జరిగింది అని తెలియ చేశారు .
ఇకపై ప్రతి నెల 2వ శనివారం మెడికల్ క్యాంపు నిర్వహించి, ఉచితంగా పిల్లలకు మందుల పంపిణి చేయటం జరుగుతుందని తెలియచేసారు.ఈ సంధర్భంగా ఎం ఎస్ ఆర్ స్పాస్టిక్స్ సెంటర్ కన్వీనర్  నేతాజీ సుబ్బారెడ్డి  మాట్లాడుతూ ఎమ్మెస్సార్ స్పాస్టిక్స్ సెంటర్ నందు మెడికల్ క్యాంప్ ను ప్రముఖ సైకియాట్రిస్ట్ డా. పి.వి.రెడ్డి చే ఏర్పాటు చేయడం తో , ఈ మెడికల్ క్యాంప్ నందు 50 మంది విధ్యార్ధులను పరీక్షించి తగు సూచలను ఇచ్చి, ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందని తెలియచేసారు. అలానే ఈ రోజు నుంచి ప్రతి రోజు విధ్యార్ధులకు ఉచితంగా నాణ్యమైన పౌష్టికారంతో పాటు గుడ్డు, పాలు, స్నాక్స్ పంపిణీ చేయడం చాలా సంతోషం గా ఉంది అని తెలియచేసారు. అలానే ఛైర్మన్ సూచలనతో స్పాస్టిక్స్ సెంటర్ స్కూల్ నందు టైమింగ్ నందు మార్పులు చేశామని తెలియచేసారు.తదుపరి విధ్యార్ధుల తల్లితండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశమునకు 45 మంది పేరంట్స్ హాజరు అయ్యి వారి సూచలను, సలహాలను తెలియచేసి రెడ్ క్రాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా శాఖ మేనజింగ్ కమిటీ సభ్యులు గునపాటి ప్రసాద్ రెడ్డి,  యడవలి సురేష్,  నెల్లూరు జిల్లా శాఖ కింద వున్న ఎం ఎస్ ఆర్ స్పాస్టిక్స్ సెంటర్ ప్రాజెక్టు కన్వీనరు నేతాజీ సుబ్బారెడ్డి, కొ కన్వీనరు  డి. జ్యోత్శ్న,ప్రిన్సిపల్ గురునాథం, వైస్ ప్రిన్సిపల్ మాధురి, రెడ్ క్రాస్ ఏ‌ఆర్‌వి కన్వీనర్  వెంకు రెడ్డి, రెడ్ క్రాస్ మెడికల్ షాప్ కన్వీనర్  మురళి క్రిష్ణ,  రెడ్ క్రాస్ జీవిత కాల సభ్యులు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags:Nellore Red Cross Spastic Center Modern Facilities Design

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page