శాంతి భద్రతలను పరిరక్షించి – చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోదించాలి-యస్.పి   వెంకట అప్పల నాయుడు

0 9,695

తిరుపతి  ముచ్చట్లు:

 

శాంతి భద్రతలను పరిరక్షించి – చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోదించాలి.పనితీరు మెరుగుపరుచుకోవాలి . ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి.తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి   వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్.తిరుపతి అర్బన్ జిల్లా యస్.వి యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు అర్బన్ జిల్లా పోలీస్ అదికారులతో నేర సమీక్ష సమావేశం తిరుపతి అర్బన్ జిల్లా యస్.  వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్  నిర్వహించారు. మహిళలు, పిల్లల ఫిర్యాదులకు (చైల్డ్ కేసు) మొట్ట మొదటి ప్రాదాన్యత ఇవ్వాలి. మహిళా, బాలికల మిస్సింగ్ కేసులకు అధిక ప్రాదాన్యత ఇవ్వాలి. యస్.ఓ.యస్ కాల్స్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలి. నేర నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలి. దొంగ తనాలను అరికట్టడానికి ప్రత్యక క్రైమ్ బృందాలు ఏర్పాటు. జిల్లా వ్యాప్తంగా ముక్యమైన ప్రాంతాలలో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి నిరంత్రయముగా తనికిలు చెప్పట్టాలి. ప్రతి కేసును శాస్ర్తీయ కోణంలో ధర్యాప్తు చేయాలి. నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ప్రతి కేసును కూడా శాస్త్రీయ కోణంలో చూసి ఫింగర్ ప్రింట్స్, క్లూస్ లను సేకరించాలి. కేసు దర్యాప్తు ప్రారంభించడానికి ముందు సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. కేసు వెనుక ఉన్న మూలాలను తెలుసుకోవాలి. అప్పుడే పురోగతి సాదించగలుగుతాం. ఓపెన్ బూజింగ్, గంజా లపై ప్రత్యేకమైన నిఘా పెట్టాలి. ఇప్పటి పరిస్థితుల్లో అంతా ఆన్లైన్ లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేకమైన టీం ఏర్పాటు.

 

 

 

- Advertisement -

మన వ్యక్తిగతం మీదే కేసు దర్యాప్తు ఆధారపడి ఉంటుంది. చేబితే చేసే వారు, నచ్చితే చేసేవారు చాలా మంది ఉంటారు. కానీ వీటికి అతీతంగా చేసేవాడే నిజాయితి పరుడు. డియస్పిలు,యస్.హేచ్.ఓ లు బాధ్యతతో మెలగాలి,వారి వారి పరిదిలో నేర నియంత్రణకు కృషి చేయాలి. అనవసరంగా సరైన ఆధారం లేకుండా ఎవరిని లాక్ అప్ లో నిర్భంధించకూడదు. వీలైనంత త్వరగా కేసు నమోదు చేసి కోర్ట్ కు తరలించాలి. అధికారం ఉంది కదాని అతిక్రమించవద్దు జిల్లా అధికారులకు సూచన. నిజాయితి, నిబద్దతతో విధులు నిర్వహించాలి. అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవు జిల్లా యస్ పి. సందర్భంగా జిల్లా యస్.పి  మాట్లాడుతూ నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. ప్రతి కేసును శాస్త్రీయ కోణంలో దర్యాప్తు చేయాలి. ముఖ్యంగా మహిళల పట్ల జరుగు నేరాలను అరికట్టాలి. యస్.ఓ.యస్ కాల్స్ కు ముఖ్య ప్రాధాన్యత ఇస్తూ సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యలను పరిష్కరించాలి.

 

 

 

సమాజంలో శాంతి భద్రతలను కాపాడటానికి ప్రాణాలకు తెగించి పోలీసులు డ్యూటీ చేస్తుంటారు. అలాంటి పోలీసులకి విధి నిర్వహణలో రౌడీ షీటర్స్, వారి చర్యలు తలనొప్పులుగా మారుతున్నాయి. ప్రతి అసాంఘిక సంఘటనలు ఏదో ఒక విధంగా రౌడీ షీటర్ల యొక్క ప్రమేయం ఉంటూఉంది వీటిని పూర్తిగా నివారించాలి. మనం చేయవలసిన పని చేస్తూ ఉండాలి.పక్క రాష్ట్రం జిల్లాలలో సమన్వయం ఎర్పచుకొని రౌడీ షీటర్ల ప్రమేయం గురించి ఆరా తీయాలి. కొత్త వారికన్నా పాత వారే ఎక్కువ నేరాలు చేస్తూ ఉంటారు. వీటిని అరికట్టాలంటే మనం కఠినంగా ఉండాలి. ఎంతటి రౌడీ షీటర్ అయినా వారికి కుటుంబం ఉంటుంది అది వారికి తెలిసే విధంగా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి.మహిళలలు, పిల్లలు, బాలికల అదృశ్యం కేసులో సమగ్రహ విచారణ జరిపి త్వరితగతిన కేసును చేదించాలి. ప్రతి కేసులో ఏదో ఒక చిన్న ఆదారం ఉంటుంది. అదే మనకు ఆయుధం. చిన్న ఆధారం ఉంటె చాలు ఎంతటి కేసునైనా చేధించవచ్చు. లాక్ అప్ పట్ల శ్రద్ద వహించాలి. ఎవరిని అనవసరంగా స్టేషన్ కు పిలిపించాకూడదు. ఒకవేళ వచ్చిన త్వరగతిగా మాట్లాడి సమస్యలుంటే పరిష్కరించి పంపివేయాలి. విసిబుల్ పోలీసింగ్ చాలా అవసరం.నేర సమీక్ష సమావేశంలో విచారణలో ఉన్న కేసులను మరియు పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న పిర్యాదులను పరిశీలించి వాటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకొని త్వరితగతిన పూర్తిచేయాలని, స్టేషన్ పరిదిలో ఎక్కువ నేరములకు తీవ్రమైననేరాలకు పాల్పడిన వారిపై ఛార్జ్ షీట్ ఓపెన్ చేయాలనీ, రౌడీ షీటర్లపై ప్రత్యేకమైన నిఘా ఉంచాలి.

 

 

 

కేడీలు డి.సి.లు, బి.సి.లను తరువుగా చెక్ చేసి వారం వారం యస్.పి కార్యాలయానికి రిపోర్ట్స్ మరియు వారి నమోదు పట్టిక పంపాలని సూచించారు. దొంగతనాలు జరగకుండా ముఖ్యమైన ప్రాంతాలలో తగిన బీట్లు, పికట్స్, లర్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసుకొని అధికారులు తరువుగా బీట్ చెక్ చేసుకొని సిబ్బందికి సూచనలుఇవ్వాలని, అలాగే దొంగతనాలను అరికట్టాలని, స్టేషన్ కు వచ్చు పిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారికీ తగిన న్యాయం చేయాలనీ ఎలాంటిపరిస్తితులైన ఎదుర్కొనేందుకు సిబ్బంది మరియు అధికారులు సిద్దంగా వుండాలని, మిస్సింగ్ కేసులు వచ్చిన వెంటనే త్వరిగాతిగా స్పందించి చర్యలు తీసుకోవాలని, వీలైనంతవరకు లోకలాదత్ ద్వారా కేసు లను తగ్గించాలని, సూసించారు. అవసరమైనచో సమన్వయంతో ఇతర జిల్లాల అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని సూసించారు.ఈ సమావేశంలో అడిషనల్ యస్.పి లు అడ్మిన్ ఇ.సుప్రజ మేడం , L&O  అరిఫుల్లా , తిరుమల మునిరామయ్య , జిల్లా లోని డి.యస్.పి లు, సి.ఐ.లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, పాల్గొన్నారు.

 

 

వివిధ కేసులలో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రతిభ ఆధారంగా శోభిత, శోధన, స్పందన,మోమెంటోలు మరియు ప్రశంస పత్రాలు జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్  అందజేశారు.

శోభిత:- 1. అడ్మిన్ ఇ.సుప్రజ మేడం,2.దిశా డియస్ పి ఆర్. రామరాజు,3.యం.సుధాకర్ రెడ్డి, సిఐ తిరుచానూర్ .

శోధన:- తొట్టంబేడు పోలీస్ స్టేషన్ ; 1.సిఐ ఆరోహణ రావు,2.బి.రాఘవేంద్ర,3,సి,గంగ కుమార్,4.యస్.యుగందర్.5.ఏ.వాసు,6.బక్తవత్సలం,7.వి.రవిచంద్ర,8.కే.హేమంతకుమార్,9.జి అరుణ్ కుమార్, రక్షక్ 9.యం.జగదీష్,10.వి.మారి ముత్తు.

స్పందన :- ఈస్ట్ పోలీస్ స్టేషన్; 1.కే.వెంకటేశ్వర్లు నాయుడు.2.కే. వెంకటముని రాజ.3.టి. ప్రభాకర్. అలిపిరి పోలీస్ స్టేషన్;4. సి. వెంకట చలపతి,5.జే.చిరంజీవి.6.జి.శివకుమార్.

పుంగనూరు దసరా ఉత్సవాల కరపత్రాలను విడుదల చేసిన మంత్రి పెద్దిరెడ్డి

Tags: Protect peace and security – Prevent illegal activities – SP Venkata Appala Naidu

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page